మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.. అలా వైకుంఠపురం లో సినిమా సూపర్ హిట్ కొట్టిన కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ని క్యాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది.. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకి కొరటాల శివ తో చేస్తుండగా త్రివిక్రమ్ మహేష్ బాబు తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ తో చేతులు కలిపి పోతున్నాడట.. అరవింద సమేత లాంటి సూపర్ హిట్ ఇచ్చినా కూడా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ చేయడానికి కారణం ఏంటో తెలియట్లేదు..

వారి నుంచి నమస్తే త్రివిక్రమ్ సినిమాలు అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండి ఉంటాయి.. హీరో తన వల్ల దూరం అవ్వటం, లేదా హీరో నుంచి ఎవరో ఒకరు దూరంగా ఉండటం వారిని మళ్ళీ కలపడానికి ప్రయత్నం చేయటం.. ఇలాంటి కథలతో త్రివిక్రమ్ అటు మార్చి సినిమాలు చేసి హిట్లు కొడుతూ ఉంటాడు.. ఆ సినిమాల్లో కథ ఎలా ఉన్న కథను డైలాగ్స్ తనదైన శైలిలో రాసి సూపర్ హిట్ కొడతాడు.. ఇక మహేష్ సినిమాకి వస్తే అలాంటి కథనే తీసుకున్నాడట త్రివిక్రమ్..

దీంతో మహేష్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ అలాంటి కథను చేయవద్దని వేడుకుంటున్నారు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయినా బుల్లితెరపై మంచి హిట్ అయ్యింది.. కాబట్టి ఈసారి థియేటర్లో దగ్గరికి పోయే సినిమా చేయాలనీ కోరుకుంటున్నారట.. ప్రస్తుతం ఫ్యామిలీ అంటే ప్రతి హీరో దూసుకుపోతున్నాడు ఈ క్రమంలో మహేష్ బాబు హీరోగా రావాలంటే త్రివిక్రమ్ పాన్  ఇండియా రేంజ్ సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. మళ్లీ తన పాత పంథాలోనే త్రివిక్రమ్ వెళ్తే మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయం.. సో వచ్చిన మూడో  అవకాశాన్ని త్రివిక్రమ్ వినియోగించుకొని హిట్ అందిస్తే ఆనందిస్తారు అన్నమాట..

మరింత సమాచారం తెలుసుకోండి: