ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక దర్శకుడికి మంచి హిట్ వచ్చాక కూడా మరో సినిమా ఛాన్స్ రాకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి.. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న అన్ లక్కీ డైరెక్టర్స్ లో  యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మొదటివరుసలో నిలిచేలా ఉన్నాడు. అరె.. మంచి దర్శకుడు అని పేరు తెచ్చుకున్నాడు, పైగా అతను మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కూడా. అయినా ఒక సినిమా కోసం సంవత్సరాలు తరబడి ఎదురుచూడటం ఏమిటండీ ? అది ఫామ్ కోల్పోయిన ఒక సీనియర్ హీరో కోసమా ?పైగా కథను ఎన్ని రకాలుగా మార్చి చెప్పినా కథ నచ్చలేదు అంటారా ? పాపం కళ్యాణ్ కృష్ణ ఇలాంటి అనేక అవమానాలతో ప్రస్తుతం బాధ పడుతున్నాడు.

నిజానికి కథలు రాయడంలో కూడా కళ్యాణ్ కృష్ణకు మంచి పట్టు ఉందని అంటారు.అలాంటి దర్శకుడిని కథ బాగాలేదు అంటూ దాదాపు మూడు సంవత్సరాలకు పైగా వెయిట్ చేయిస్తారా ? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అతని తరుపున అడిగేవారు లేకపోవడం కూడా కళ్యాణ్ కృష్ణ కష్టానికి కారణంలా కనిపిస్తోంది. అందుకే అతని ఎదురుచూపులు ఇంకా ఎదురుచూస్తూ ఉన్నాయట. అయినా అక్కినేని కాంపౌండ్ లో ఓ కథ రాస్తూ.. దాన్ని ఒప్పించలేక.. మధ్యలోనే సినిమాని వదిలేసుకుని వెళ్ళిపోయిన దర్శకులు గతంలో చాలామందే ఉన్నారు. నాగార్జునకి ఒక బ్యాడ్ హేబిట్ ఉంది. కథ ఎంత త్వరగా ఒప్పుకుంటాడో, నచ్చకపోతే అది సంవత్సరాలు గడుస్తోన్నా దాన్ని ఇక అసలు ఒప్పుకోలేడు.

 అది తెలియక సినిమా చేస్తాను అని ఒప్పందాన్ని వదిలిపెట్టలేక నానాకష్టాలు పడుతున్నాడు కళ్యాణ్ కృష్ణ.సహజంగా నాగ్ ను స్క్రిప్ట్ విషయంలో తానూ చాల ఈజీగా ఒప్పించగలను అనుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. కానీ కళ్యాణ్ కృష్ణ ఎన్ని కొత్త కథలు చెప్పినా.. వద్దు, బంగార్రాజు కథనే చేద్దాం అంటున్నాడట. కాకపోతే ఆ బంగార్రాజుతో నాగ్ ను ఒప్పించడం ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు. దీనికితోడు కరోనా ఎఫెక్ట్ ఒకటి. ఇక తానూ ఎప్పుడు సినిమా తీయాలి అని కళ్యాణ్ కృష్ణ ఫీల్ అవుతోనట్లు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణకి ఈ గతి పట్టడానికి కారణం రవితేజతో చేసిన 'నేల టికెట్' సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడమే అని వేరే చెప్పనక్కర్లేదు. నేల టికెట్ సినిమా నిరుత్సాహ పరచకపోయి ఉంటే.. నాగ్ అతన్ని వెయిటింగ్ లో పెట్టి ఉండే వాడు కాదు. ఏది ఏమైనా ఇప్పటికీ నాగార్జున బంగార్రాజు మీదకు ఎప్పుడు వస్తాడో ఇప్పటివరకు క్లారిటీ లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: