సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కెరీర్లో చేయని పని ఏదైనా ఉంది అంటే అది ఒక్కటే అని చెబుతున్నాడు.. టాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ కు ఎంతటి వివాదాస్పదమైన పేరు ఉందో అందరికీ తెలుసు.. టాలీవుడ్ స్టార్ లను నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వారి అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.. అప్పుడెప్పుడో చేసిన శివ సినిమా ని ఇప్పటికీ చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ..

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలే ఉన్నాయి.. అయితే వాటిలో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో,  ఏ సినిమా ముందు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో , ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకే కాదు ఆయన కూడా తెలియదు.. రీసెంట్ గా రాజశేఖర్ దయ్యం సినిమాని రిలీజ్ చేశాడు రాంగోపాల్ వర్మ..  ఈ సినిమా కూడా రాంగోపాల్ వర్మ తీసిన కళాఖండాల లో ఒకటిగా మిగిలిపోయింది.. శివ ఆ తర్వాత క్షణక్షణం ఆ తర్వాత గోవిందా గోవిందాఈ మూడు సినిమాలు తప్ప, రామ్ గోపాల్ వర్మ కెరీర్లో ఆహా అనిపించే సినిమా ఒక్కటి కూడా లేదని ప్రతి ప్రేక్షకుడిని అడిగిన తెలుస్తోంది..

నిత్యం ట్విట్టర్ లో యూట్యూబ్ లో ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా తాను తన 35 ఏళ్ళ కెరీర్లో సెలవు అనే మాటను మర్చిపోయానని వెల్లడించాడు.. హిట్టో, ఫ్లాపో ,సినిమా రిలీజ్ అవుతుందో కాదో కానీ నిత్యం ఏదో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంటున్నాను అని రాంగోపాల్ వర్మ చెప్పకనే చెప్పాడు కానీ ఇలా సెలవు లేకుండా షూటింగ్లు చేయడం ఏమిటో అర్థం కావట్లేదు..వెబ్ సిరీస్ లు సినిమాలు అనే తేడా లేకుండా ఏదో ఒక సినిమా చేస్తూ ఉండే ఆ జీవికి స్నేహితులు గారి కుటుంబ సభ్యులు ఎవరూ లేరు అని అయన చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి: