టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన భార్గవ్ 14 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన తరవాత భార్గవ్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మరి కొందరు యువతులను కూడా భార్గవ్ అవకాశాలతో మోసం చేశాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. యూట్యూబ్ లో ఇంటర్వ్యూ లతో ఫేమస్ అయిన యాంకర్ శివ కూడా భార్గవ్ పై ఆరోపణలు చేసాడు. అంతే కాకుండా భార్గవ్ భాగోతాన్ని ముందుగా భయట పెట్టింది కూడా యాంకర్ శివనే. అంతే కాకుండా భార్గవ్ గురించి మాట్లాడినందుకు అతడి టీమ్ నుండి బెదిరింపులు కూడా వస్తున్నాయని శివ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇక భార్గవ్ ను అరెస్ట్ చేసి దిశ చట్టం కేసు నమోదు చేయడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అంతే కాకుండా కొందరు భార్గవ్ తో కలిసి వీడియోలు తీసిన వారి ఫోటోలను యూట్యూబ్ థంబ్నెయిల్స్ గా వాడుతున్నారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే భార్గవ్ తో కలిసి వీడియోలు తీసిన ఓ మై గాడ్ నిత్య స్పందించింది. 

తెలియక తన ఫోటోలను వాడుతున్నారేమో..ఆ అమ్మాయి నేను కాదని...తన ఫోటోలను తీసేయాలని కోరింది. ఇక తాజాగా మౌనిక అనే మరో యువతి ఆ అమ్మాయి నేను కాదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. వీడియో లో మౌనిక మాట్లాడుతూ..."ఫన్ బకెట్ భార్గవ్ అరెస్ట్ అయిన విషయం మీ అందరికీ మీకెలా తెలుసో నాక్కూడా అలాగే తెలిసింది. భార్గవ్ తో కలిసి అప్పట్లో అమ్మాయి అబ్బాయి వీడియోలు చేసాను. కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా లేదు. ఆ  వీడియోలు ఆపేసి కూడా రెండు సంవత్సరాలు దాటింది. అయితే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి వీడియోలు తీసిన టైమ్ లోని ఫోటోలను ఈ కేసు విషయంలో వాడుతున్నారు. నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఫోటోలను వీడియోలను ఇప్పుడు డిలీట్ చేస్తారని కోరుకుంటున్నా"అంటూ వీడియో మౌనిక పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: