ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒక సాదా సీదా కామెడీ షోగా ప్రారంభం అయిన జబర్దస్త్ ఆ తర్వాత అంతకంతకూ క్రేజ్ సంపాదించుకుంటూ ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే జబర్దస్త్ కార్యక్రమం బాగా విజయవంతం అవడమే కాదు ఎంతో మంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు వరకు సినిమా ఇండస్ట్రీకి అసలు పరిచయం లేని సరికొత్త కమెడియన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్ కామెడీ షో.


 జబర్దస్త్ అంటే ప్రస్తుతం అసలుసిసలైన కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది . అయితే రోజురోజుకు జబర్దస్త్ కామెడీ షో అంతకంతకు క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతుంది. అయితే జబర్దస్త్ లో ఎంత మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది.  అదిరే అభి స్కిట్స్ లో చిన్న కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది ఆ తర్వాత తన టాలెంట్ నిరూపించుకుని ఏకంగా టీం లీడర్ గా మారిపోయాడు.


 ఇక హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే చాలు పంచులు వర్షం కురుస్తూ ఉంటుంది అయితే ఎప్పుడూ హైపర్ ఆది తనపై తాను కాకుండా ఎప్పుడూ తన కుటుంబ సభ్యుల పై పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు ముఖ్యంగా హైపర్ ఆది టీం లో ఒక వ్యక్తి ఒక అందాన్ని కించపరిచే విధంగా లేదా తప్పులను ఎత్తి చూపే విధంగా ఉంటాయి  పంచులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన జబర్దస్త్ కమెడియన్స్ షేకింగ్ శేషు ఇటీవలే హైపర్ ఆది స్కిట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైపర్ ఆది స్కిట్ లో భాగంగా ఇక ఎంతో మంది అందాన్ని  కూడా ఎత్తిచూపుతూ హింసించే విధంగా పంచులు వేస్తూ కామెడీ పంపుతూ ఉంటాడు అంటూ షేకింగ్ శేషు చెప్పుకొచ్చాడు. అయితే అదే ప్రేక్షకులకు నచ్చుతుందని ఇక తన కామెడీ శైలి కూడా అంతే అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: