ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో విజేతగా నిలిచిన అభిజీత్ దుద్దాల షోలో మొదట్నుంచీ కూడా ఎంతో జాగ్రత్తగా ఆడుతూ అటు ప్రేక్షకులతో పాటు ఇటు అందరూ అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఆ విధంగా అభిజిత్ భారీ స్థాయి ఓట్లతో ఆ సీజన్ లో విజేతగా నిలవడం జరిగింది. అంతకుముందు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ తర్వాత పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేసి మంచి పేరు దక్కించుకున్నాడు.

ఇక ప్రస్తుతం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా అభిజీత్ కి మంచి క్రేజ్ ఉంది. అసలు విషయం ఏమిటంటే బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్స్ లో ముఖ్యంగా అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, సోహైల్ వంటివారు ప్రస్తుతం సినిమా అవకాశాలతో టాలీవుడ్ లో ముందుకు సాగుతున్నారు. అలానే మరో వైపు అరియానా, అవినాష్, మెహబూబ్ వంటివారికి కూడా పలు వెబ్ సిరీస్ లలో ఛాన్స్ లు వస్తున్నట్లు సమాచారం.  అయితే విజేతగా నిలిచిన అభిజీత్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కాని వెబ్ సిరీస్ కానీ ఎనౌన్స్ చేయకపోవటం ఆశ్చర్యకరం.

అయితే నిజానికి జరిగిన విషయం వేరని ఇప్పటికే కొన్ని సినిమా స్టోరీ లతో పాటు వెబ్ సిరీస్ ల కథలు కూడా అభిజీత్ విన్నారని, అలానే పలువురు ఆయన తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారని కానీ వాటిలో చాలా వరకు ఆయనకీ ఆశించిన స్థాయి క్యారెక్టర్ అయితే దక్కలేదని అందుకే అభిజీత్ ప్రస్తుతం ఏ సినిమా ఒప్పుకోలేదని అతి త్వరలో మంచి అవకాశం దొరికితే తప్పకుండా ఆయన దానిని మీడియా ముఖంగా ఎనౌన్స్ చేస్తారని అభిజిత్ సన్నిహితులు చెబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభిజిత్ నుంచి ఎనౌన్స్ మెంట్ కోసం ఆయన అభిమానులు ఎప్పటి నుంచొ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: