బాలయ్య సినిమాలు అంటే అందరికీ కచ్చితంగా ఒకటి స్పురించడం ఖాయం. బాలయ్య అంటేనే పక్కా మాస్ హీరో. యాక్షన్ హీరో. ఆయన మూవీస్ లో ఫైట్లకు లెక్క ఉండదు, భారీ డైలాగులు, ఆజానుబాహులైన విలన్లు ఇలా చాలానే కధ ఉంటుంది. లావిష్ గా కూడా సినిమా ఉంటుంది.

మరి బాలయ్యతో అనిల్ రావిపూడి మూవీ అంటూ న్యూస్ వస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటికి అయిదు సినిమాలు తీస్తే అయిదుకు అయిదూ కామెడీ టచ్ ఉన్నవే. మిగిలిన అంశాలు ఉన్నా కూడా అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ మాత్రం అనిల్ చేయలేదు. కానీ బాలయ్యతో కనుక జట్టు కడితే  ఫుల్ గా మాస్ లోకి దిగిపోవాల్సిందే. మరి అనిల్ దీనికి సంబంధించి ఎలాంటి కధను రెడీ చేసుకున్నారు అన్నదే ఇక్కడ చర్చగా ఉందిట.

అనిల్ రావిపూడి ఆ మధ్యన రామారావు పేరుతో ఒక కధను బాలయ్యకు వినిపించారుట. అయితే ఎందుకో బాలయ్య నాడు ఓకే చేయలేదు అంటారు. మరిపుడు బాలయ్య వద్దకు అదే కధతో అనిల్ వెళ్లాడా అన్న ప్రశ్న అయితే ఉంది. మరి బాలయ్యకి ఆ కధ నచ్చిందా లేక అలాంటి లైన్ లోనే మరో కధ చెప్పారా అన్నది కూడా చూడాలి.

ఏది ఏమైనా అనిల్ రావిపూడి పూర్తిగా తన స్టైల్ ఆఫ్ మేకింగ్ నుంచి బయటకు వస్తేనే బాలయ్య కాంబో తో మూవీ వస్తుంది అంటున్నారు. అయితే ఏ డైరెక్టర్ అయినా చాన్స్ కోసమే చూస్తారు. వారు ఫలానా జానర్ కి కట్టుబడిపోదమని అనుకోరు. అందువల్ల అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో ఇపుడు యాక్షన్ జానర్ వైపు వెళ్ళినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి ఈ కాంబో సెట్ అయితే మాత్రం అదే అసలైన అట్రాక్షన్ అంటున్నారు. చూడాలి మరి అనిల్ రావిపూడి బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: