పవన్ కళ్యాణ్ ఇపుడు టోటల్ టాలీవుడ్ కి ఆదర్శంగా కనిపిస్తున్నాడుట. ఆయన ప్లానింగ్ చూసిన మిగిలిన హీరోలు కూడా ఇదే కరెక్ట్ రూట్ అని అనుకుంటున్నారుట. టాలీవుడ్ లో పవన్ కి ఉన్న చరిష్మా ఎవరికీ లేదు. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు.

అలాంటిది పవన్ కళ్యాణ్ తన మొత్తం కెరీర్ లో పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయలేదు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాక మాత్రం పవన్ ఒక్కసారిగా మారిపోయాడు. ఒక విధంగా పవన్ దూకుడు చూస్తున్న వారికి పాత రోజులు గుర్తుకు వస్తున్నాయట. అప్పట్లో ఒక్కో హీరో ఏడాదికి కనీసం మూడు సినిమాలు అయినా చేసేవారు. సంక్రాంతికి కచ్చితంగా ఒక సినిమా ఉంటే సమ్మర్ కి ఒకటి, దసరాకు మరోటి అన్నట్లుగా నాటి హీరోల  మూవీ ప్లానింగ్ ఉండేది.

కానీ  ఇపుడు పవన్ విషయం తీసుకుంటే ఆయన కూడా ఏడాదికి మూడు సినిమాలు అంటున్నారు.ఆయన చేతిలో ఆరు సినిమాలు ఉంటే వకీల్ సాబ్ ని ముందుగా థియేటర్లలోకి వదిలాడు. ఇపుడు అయిదు సినిమాలు లైన్ లో ఉన్నాయి. 2024 నాటికి అన్ని సినిమాలు చేసేసి ఎన్నికల ప్రచారంలోకి దిగాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే పవన్ తన సినిమాలకు యాభై నుంచి అరవై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అంటున్నారు. ఆ విధంగా చూస్తే 2024 నాటికి కచ్చితంగా  300 కోట్ల భారీ రెమ్యునరేషన్ ని టోటల్ గా అందుకోవాలన్నదే పవన్ ప్లాన్ గా ఉందిట.

ఇక పవన్ తో పాటుగా ఉన్న ప్రభాస్, మహేష్, బన్నీ, చరణ్, ఎన్టీయార్ లాంటి హీరోలు కూడా కనీసం ఏడాదికి రెండేసి సినిమాలు అయినా చేసేలా ప్లాన్ చేసుకుంటేనే కరోనా కష్టాలను టాలీవుడ్ అధిగమిస్తుంది అంటున్నారు. అంటే ఇపుడు అందరూ పవన్ని ఫాలో కావాల్సిందే అంటున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: