ఇటీవలే కూతురు పెళ్లి చేశాక కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్న నాగబాబు మళ్లీ యూట్యూబ్ బాట బయటపెట్టాడు.. జబర్దస్త్ షో తో బుల్లితెర పై గతంలో ఎన్నడూ లేనివిధంగా దూసుకుపోయాడు.. ఆ షో ఇప్పటికీ ప్రసారమౌతున్న నాగబాబు మధ్యలో కొన్ని అనివార్య కారణాలవల్ల బయటికి వచ్చి వేరే ఛానల్లో మరొక షో కి జడ్జిగా చేశాడు.. అక్కడ కూడా కొన్ని రోజులు చేసి మళ్లీ బయటికి వచ్చి యూట్యూబ్ ఛానల్ లో కామెడీ షో అంటూ మొదలు పెట్టాడు.. అది కూడా పూర్తిగా చేశాడంటే నాలుగైదు ఎపిసోడ్ లే చేసి ఆపేసి మళ్ళీ కామ్ గా ఉన్నాడు..

ఆ తర్వాత కూతురు పెళ్లి చేసిన నాగబాబు కొన్ని రోజులు సైలెంట్ గ ఉండి ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ లో సరికొత్త వెబ్ సిరీస్ లు అంటూ మొదలు పెడుతున్నాడు.. అయితే ఈ వెబ్ సిరీస్ 10 నుండి 12 ఎపిసోడ్ లు ఉండగా దీన్ని ఫ్రీగా యూట్యూబ్ లో తన చానల్లో వీక్షించవచ్చు అని ప్రేక్షకులకు చెబుతున్నాడు. ఈ మధ్య ఓటిటి ల సంస్కృతి ఎక్కువైపోతున్న డంతో ప్రేక్షకులు అందరూ వచ్చే షోలకు సినిమాలకి కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, మరి కొన్ని పేపర్లు ఈ పద్ధతిలో పేమెంట్ చేయాల్సి వస్తుంది..

 కానీ నాకు పంపు చేసేయ్ వెబ్ సిరీస్ కి ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదు ఫ్రీగానే చూడొచ్చు అని ప్రేక్షకులకు విన్నవిస్తున్నాడు.. ఈ ఎపిసోడ్ నుండి అదిరింది లో అదరగొట్టిన గల్లీ బాయ్స్ టీం చేయనుందట.. మరి అదిరింది షో తో ఇప్పటికీ వారి ప్లేస్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఇప్పుడు ఆ షో ఆగిపోయిన కూడా వారి క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు ఈ నేపథ్యంలో నాగబాబు యూట్యూబ్ ఛానల్ లో చేస్తున్న వీరు ఏ రేంజ్ కి వెళ్తారు చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: