టాలీవుడ్ లో దిగ్గజ దర్శక  ధీరులలో డైరెక్టర్ రాజమౌళి కూడా ఒకరు. ఈయన తీసిన  సినిమాలలో  ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు అంటే అది అతిశయోక్తి కాదు. అంతలా తన తెలివి తేటలను ప్రదర్శిస్తుంటారు.  అయితే ఈయన సినిమా అంటే సంవత్సరాలు పట్టాల్సిందే అంటుంటారు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల వారు. మొదట్లో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ బాహుబలి సినిమా మొదలు పెట్టాక పరిస్థితి ఇలా మారిపోయింది. ఆ సినిమాకు  సుమారు ఐదేళ్ల తీసుకోవడంతో రాజమౌళి సినిమా అంటే ఏళ్లతరబడి షూటింగ్ జరగాల్సిందే అని అన్నారు. ఆ విషయం ఎంతగా పాకి పోయిందంటే, బాహుబలి ఆడియో ఫంక్షన్ లో ఈ విషయాన్ని ఆయనే సెంట్రల్ చేసుకునేంత గా మారిపోయింది.

ఇక 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ నవంబర్ 2018 లో మొదలైన విషయం అందరికి తెలిసిందే. మొదట్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది. దీంతో సినిమా రిలీజ్ టైం జూలై 30 2020 కి సినిమా వచ్చేస్తుంది అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల సంక్రాంతి కానుకగా జనవరి 8 2021 నాటికి వాయిదా పడింది. అయితే ఈసారి కరోనా ఫస్ట్ వేవ్ కారణంతో సినిమాను మళ్లీ వాయిదా వేశారు. ఇక ఈసారి అక్టోబర్ 13 2021 అని కూడా చెప్పారు.

అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, ఈసారి కూడా ఈ డేట్ కూడా వచ్చేలా లేదు. త్వరలోనే మరో కొత్త తేదీని ప్రకటిస్తారని సమాచారం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటన్నది అంటే, బాహుబలి షూటింగ్ అన్ని రోజులు జరగడానికి, ఈ సినిమా అన్ని సార్లు వాయిదా పడటానికి అంతా రాజమౌళి కారణమట. ఎందుకంటే నాణ్యత కోసమా లేక ఇంక ఎదైనా కారణమో తెలియదు కానీ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ వెనుక కూడా తొలిసారి రాజమౌళి నే కారణం. ఇక రెండవ సారి కరోనా కారణం అని తెలిసింది. దీంతో ఈ సినిమా వాయిదా అయిన ఖాతాలో పడలేదు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుంది అంటున్నారు. అయితే ఇది కూడా కరోనా ఖాతాలోనే పడుతుందని రాజమౌళి కాస్త ఊపిరి పీల్చుకోవచ్చేమో. చూద్దాం ఇక ఆర్.ఆర్.ఆర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: