కరోనా వేడి గాలులు ఎక్కువగా తాకింది సినీ పరిశ్రమనే. పోయిన సారి లాక్ డౌన్ సమయంలో ఎక్కడ షూటింగ్ లు అక్కడ ఆగిపోవడంతో రోజు వారి సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిన విషయం అందరికి తెలిసిందే. సరైన సమయంలో సినిమాలు రిలీజ్ కాకపోవడం వల్ల... ఆ ప్రభావం సినీ దిగ్గజాలపై, నిర్మాతలపై భారీగా పడింది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు... సినిమాలు విడుదల కాక ఆర్థికంగా చాలా క్రుంగి పోయారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగి థియేటర్ ఓపెన్ చేసి... సినిమాల విడుదల అయ్యి సినీ పరిశ్రమ తిరిగి వేగం పుంజుకుంటుంది అనుకునే లోగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకొచ్చింది.

వాస్తవానికి ఇంకా వైరస్ ప్రభావం ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. వైరస్ వ్యాప్తి మరింత ప్రమాదకరంగా మారడంతో... లాక్‌డౌన్‌ సంగతి అటుంచితే ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన కొన్ని క్రేజీ సినిమాలను మేకర్స్ ఇప్పటికే వాయిదా వేసేశారు. ఇందులో.. నాగచైతన్య లవ్ స్టోరీ మూవీ, నాని టక్ జగదీష్ వంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వైరస్ ఉధృతి మరింత పెరగడంతో..ఏప్రిల్ చివరి నుండి  మే అంతా థియేటర్లకు లాక్ డౌన్ పెట్టే అవకాశం  కనిపిస్తున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో చిన్న సినిమాలు దాదాపు 10 వరకు ఉన్నా.. అవి కూడా విడుదలకు నోచుకునే భాగ్యం కనిపించడం లేదు.

మే చివరి నాటికి పరిస్థితి కాస్త చక్కబడుతుంది థియేటర్లు రీ ఓపెన్  అవుతాయి అని అంచనా వేస్తున్నప్పటికీ... జూన్, జూలై మాసాలలో కే జి ఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో.. అప్పుడు ఒక్కసారిగా ఆగిన సినిమాలన్నీ విడుదల చేయాలంటే సమస్యాత్మకమైన విషయం కాబట్టి... పరిస్థితిని అర్థం చేసుకొని చిన్న సినిమాలు ఓటీటీ వేదికల ను ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఇలా కరోనా ఓ వైపు ప్రజలను పీల్చి పిప్పి చేస్తూనే... మరో వైపు సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది.  ఒక్క సినీ పరిశ్రమనే కాదు... అన్ని ఆర్థిక రంగాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఈ బాధ తప్పదు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: