నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అఖండ.. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.. ఇటీవలే టీజర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న  ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పెలా చేసింది.. గత కొన్ని సినిమాలతో సతమతమవుతున్న బాలకృష్ణ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.. ఈ నేపథ్యంలోనే తనకు కు మంచి హిట్లు ఇచ్చిన బోయపాటి తో చేతులు కలిపాడు.. 

ఇక ఈ సినిమాతో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించాడని రిలీజ్ అయిన రెండు టీజర్ల ను బట్టి తెలుస్తోంది.. ఒక పాత్ర ఫ్యాక్ష నిస్ట్ కాగా మరొక పాత్ర అఘోర అని  ఈ రెండు టీజర్ ల  ద్వారా తెలిసింది.. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కు ఉన్న  క్రేజ్ ను ఈ చిత్ర బృందం ఉపయోగించుకోవడం లేదు నా వార్త ఇప్పుడు పాకిపోతోంది.. నిజానికి ఈ సినిమా టీజర్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా బాలయ్య టీజర్ వచ్చింది అన్న ధ్యాస ఎవరికీ లేకుండా పోయింది.. ఒకప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ చిన్న అప్డేట్ చిన్న ఎంతో హంగామా చేసేవారు కానీ ఈ టీజర్ కి ఏ మాత్రం హంగామా చేయలేదు వారు.. 

మరి ఇదిలా ఉండగా బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి అని ఆల్రెడీ అనీల్, బాలయ్యకు ఓ సాలిడ్ స్క్రిప్ట్ లైన్ వినిపించగా బాలయ్య ఓకే కూడా చేసారని టాక్. మరి అంతా సెట్టయితే ఈ ప్రాజెక్ట్ రాబోయే బాలయ్య బర్త్ డే సందర్భంగానే లాంచ్ చేస్తారని తెలుస్తుంది.  ఏదేమైనా బాలకృష్ణ క్రేజ్ని సినిమాలకు వాడుకుంటున్నారని సినిమాలు హిట్ అవుతాయి లేదంటే బాలకృష్ణ గత సినిమాల్లాగే అవుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: