పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి దాదాపు మూడు సంవత్సరాల తరువాత వచ్చిన లేటెస్ట్ మూవీ 'వకీల్ సాబ్'.. ఈ సినిమా ఫ్యాన్స్ ని ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి వేణు శ్రీ రామ్ దర్శకత్వం వహించాడు. యస్ యస్ తమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు.మంచి టాక్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాలో అంజలి, నివేద తామస్, అనన్యలు కీలక పాత్రలు పోషించారు. అయితే అందులో అంజలి, నివేద కన్నా కూడా దివ్య అనే అమాయికపు అమ్మాయి పాత్రలో నటించి అలరించిన అనన్య నాగళ్ళ మాత్రం ఇప్పుడు యూత్ కి కలల రాణిగా తయారయ్యింది అనే చెప్పాలి. తెలంగాణకు చెందిన ఓ ట్రైబల్ యువతిగా ఈమె ఈ సినిమాలో మంచి నటన కనపరిచింది.ఇక అనన్య గతంలో 'మల్లేశం' 'ప్లే బ్యాక్' వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే 'వకీల్ సాబ్' తో అనన్య ఇమేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి. దానిని క్యాష్ చేసుకోవడం కోసం నిత్యం గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది ఈ అమ్మడు.

ఇక 'వకీల్ సాబ్' ప్రమోషన్లలో భాగంగా ఇక నుండీ కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలతో పాటు గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చెయ్యాలి అని ఆశపడుతున్నట్టు ఈమె చెప్పుకొచ్చింది. ఇక అందుకోసం ఈమె గ్లామర్ డోస్ పెంచాలని డిసైడ్ అయ్యింది.చెప్పినట్లుగానే గ్లామర్ ఫొటో షూట్లతో యూత్ కి పిచ్చెక్కిస్తుంది ఈ అమ్మడు. మొన్నోసారి ఒక ఫొటో షూట్ చేసింది. ఇక ఆ ఫోటోలు అప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.ఇక ఇప్పుడు మళ్ళీ తాజాగా ఫొటో షూట్ చేసింది.ఇక ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇందులో చీరలోనే తన నడుము సోయగాలను చూపిస్తూ కుర్ర కారుని కైపేక్కిస్తుంది.











మరింత సమాచారం తెలుసుకోండి: