టాలీవుడ్ లో కొన్ని మరిచిపోలేని కాంబినేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అలీ కాంబినేషన్ అంటే దాదాపు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఒకానొక సమయంలో అలీ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా ఉండేది కాదు. ఏదో ఒక విధంగా అలీ కోసం ఒక పాత్రను సృష్టించి అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమాలో దర్శకులు ఇరికించే వారు. అయితే ఇద్దరూ రెండు వేరు వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో ఇక ఈ కాంబో మళ్లీ కనిపించదేమో అని అందరూ భావించారు. 

కానీ వీరిద్దరితో ఒక కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అలీ కోసం ఒక ట్రాక్ రాసుకున్నాడట దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్ తోనే ఈ ట్రాక్ రాసుకున్నాడని, ఆ ట్రాక్ కి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. 

సో ఇద్దరికీ ఇష్టమే కావడంతో త్వరలోనే ఈ గాసిప్ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. నిజానికి ప్రకాష్ రాజ్ కు బీజేపీ అంటే అస్సలు పడదు. ఎప్పుడు చూసినా బీజేపీ మీద విమర్శల వర్షం కురిపిస్తుంటారు. మరో పక్క పవన్ ఏమో బీజీపీటో కలిసి పని చేస్తున్నారు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించి తమ నటనతో మెప్పించారు. ఇదే కోవలో ఆలీతో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ కాంబో అంటే కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. చూడాలి అని దర్శకుడు ఎంతవరకు అందుకోగలరు అనేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: