ఒకరకంగా హీరోయిన్స్ పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తారు లేదా పూర్తిగా మానేస్తారు. కొన్నాళ్ల పాటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత బోర్ కొట్టి మళ్ళీ సినిమాల వంక చూస్తూ ఉంటారు. అలా ప్రేమించి పెళ్లాడి సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయిన మరో భామ ఇప్పుడు మళ్లీ సినిమా ఇండస్ట్రీ వైపు చూస్తోంది. ఆమె మరెవరో కాదు కుర్రకారు గుండెల్ని అప్పట్లో దోచేసిన కలర్స్ స్వాతి. పదహారేళ్ళ ప్రాయంలోనే తన చిరునవ్వుతో కుర్రాళ్లను తన కొంగు కట్టేసుకున్న ఈ భామ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా మారింది. అయితే హీరోయిన్ గా ఎక్కువ కాలం నిలవ లేకపోయినా ఈ తెలుగు భామ  ఒక కేరళ కుర్రాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.

 అయితే ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆమెకు మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయని ఈ నేపథ్యంలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఆమె సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. ఈ భామ హర్ష పులిపాక అనే కుర్ర దర్శకుడు తెరకెక్కిస్తున్న పంచతంత్రం అనే ఒక ప్రయోగాత్మకమైన సస్పెన్స్ థ్రిల్లర్ లో ఒక కీలక పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది హీరోయిన్ పాత్రా ? లేక సాధారణ పాత్రా ? అనేది తెలియాల్సి ఉంది. 

నిజానికి ఈ సినిమాలో బ్రహ్మానందం, సముద్రకని లాంటి అగ్ర నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత్రకు ఇంపార్టెన్స్ ఉండడంతోపాటు పెద్ద పెద్ద నటులతో కలిసి మళ్లీ నటించే అవకాశం దక్కడంతో ఈ భామ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భర్త స్వతహాగా పైలెట్ కావడంతో ఆమె విదేశాలకు వెళ్లి సెటిల్ అయింది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాల వంక చూస్తున్న కారణంగా హైదరాబాద్ కి మకాం మారుస్తుందా లేక ఈ ఒక్క సినిమాకే పరిమితం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: