ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాలుగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అతి ఎక్కువ కేసులు పెరిగిపోతున్నాయి. చూస్తూ చూస్తుండగానే వందల కేసులు వేల కేసులు గా మారిపోతున్నాయి. దీంతో ప్రజలలో మరోసారి ప్రాణభయం పట్టుకుంది. అయితే మునుపటిలా కాకుండా కరోనా సెకండ్ వేవ్ మరింత వేగంగా విజృంభిస్తుండడం..  అంతేకాకుండా ఇక వైరస్ సోకిన వారిలో చాలామంది ఆసుపత్రుల పాలవుతు ఉండడంతో ఎంతోమంది మరింతగా బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం గతంలో చిత్ర పరిశ్రమ పై ఎంతల పడిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 గత ఏడాది ఇదే సమయానికి కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో ఇక లాక్ డౌన్ అమలులోకి రావడంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ మొత్తం మూగ పోయింది. షూటింగ్ లు మొత్తం నిలిచిపోవడంతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినిమా స్టార్స్ అందరూ కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాల్లో భాగంగా ఇటీవల సినిమా షూటింగ్ మొదలయ్యాయి. ఈ సినిమా విడుదల కూడా ప్రారంభం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం మాత్రం అందరినీ బెంబేలెత్తిస్తోంది



 ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి సినిమా షూటింగ్ లు మొత్తం అవకాశం ఉంది అని టాక్ కూడా వినిపిస్తుంది. అయితే టాలీవుడ్ హీరోలు అందరూ ఇక ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు తెలుస్తోంది.  కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అటు హోమ్ క్వారంటైన్ ఎంతో ఉత్తమం అని టాలీవుడ్ స్టార్ హీరోలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇటీవల తన వ్యానిటీ డ్రైవర్  వైరస్ తో చనిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు సర్కారు వారి పాట రాధేశ్యాం సినిమా షూటింగ్ లలో పాల్గొన్న కొంతమందికి కరోనా వైరస్ సోకాడంతో మహేష్ ప్రభాస్ కూడా సెల్ఫ్ ఐసోలేషన్ లో కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా హీరోలు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లడం తో  సినిమా షూటింగులకు బ్రేక్ పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: