అభిమాన నటులు లేదా సెలబ్రిటీలు కనిపించగానే వారితో ఫోటో దిగాలని ఆసక్తి చూపడం సాధారణంగా జరిగే విషయమే. అయితే తాజాగా హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా అర్షి ఖాన్ కు ఒక అనుకోని వింత అనుభవం ఎదురైంది. ఈ మధ్య ఈ భామ ఎయిర్పోర్టులో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక అభిమాని పరిగెత్తుకు వచ్చి ఆమెతో ఫోటో దిగాలని కోరాడు. సాధారణంగా ఫోటోలు అడిగినప్పుడు సెలబ్రిటీలు ఖాళీగా ఉంటే ఫోటో దిగి వెళ్ళి పోతూ ఉంటారు. ఆమె కూడా ఫోటో దిగడానికి అవకాశం ఇచ్చింది. 

ఫోటో దిగిన అనంతరం ఆ కొంటె అభిమాని ఆమె చేతిని అందుకొని చేతిని ముద్దాడడం, ఆ ముద్దాడిన విషయం ఒక వీడియోలో రికార్డు కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో అర్షి ఖాన్ ను ముద్దాడిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. ఇది జరిగిన వెంటనే తన మైండ్ కాసేపు పని చేయలేదని దీంతో వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాను అని ఆమె చెప్పుకొచ్చింది.

 ఇక సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఆమెకి  కరోనా పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తనకు కొద్దిగా లక్షణాలు కనిపించడంతో తాను ఐసోలేషన్ లో ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీస్ నుంచి తనకు కోవిడ్ టెస్ట్ రిపోర్టులు వచ్చాయని ఏప్రిల్ 19న చేసిన పరీక్షలో తనకు పాజిటివ్ గా తేలిందని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి అదే రోజు అభిమాని ఆమె చేతిని ముద్దాడడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: