కరోనా మహమ్మారి ప్రజల పై తన ప్రతాపాన్ని చూపిస్తుంది.. గతంతో పోలిస్తే ఇప్పుడు మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడుతున్న వారికి సంఖ్య భారీగా పెరుగుతుంది. అంతకు మించి మరణాలా రేటు కూడా పెరుగుతుంది. హోదా తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తుంది. సినీ ,రాజకీయ ప్రముఖుల్లో కొందరు కరోనా బారిన పడి మృత్యువు ఒడిలోకి చేరారు. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం కరోనా బారిన ప‌డుతున్నారు. సీఎంలు వంటి వారికే క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవుతుంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవ‌చ్చు.


అయితే, సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి స్టార్ హీరోల‌తో పాటు సోనూసూద్ వంటి న‌టులు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌హేష్ బాబు, ప్ర‌భాస్‌ల వ్య‌క్తిగ‌త సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావడం తో వీరు క్వారంటైన్ ‌కు వెళ్లారు. కాగా, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారంరోజుల క్రితం వరకూ ఆయన హైదరాబాద్‌లో 'ఆచార్య' చిత్రీకరణలో పాల్గొన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంలో రెండ్రోజుల క్రితం చిత్రీకరణ నిలిపేశారు. ఇటీవల ఆయన వ్యానిటీ వ్యాన్‌ డ్రైవర్‌ కరోనా బారిన పడి మరణించారు. 


అలాగే చరణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరికి కూడా కరోనా సోకడంతో రామ్‌చరన్‌ స్వీయ నిర్భందంలోకి వెళ్లారని సమాచారం. గతంలో రామ్‌చరణ్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా వారికే కరోనా సోకుతుందంటే రెక్కాడితే కానీ, డొక్కాడని సామాన్యుల పరిస్థితి ఎంటా అర్థం చేసుకోవచ్చు.. తమిళ ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.. ఇప్పటికే థియేటర్లు బంద్ అయిన విషయం తెలిసిందే. షూటింగ్ లకు కూడా ఆంక్షలు విధించారు.. ఈ మహమ్మారికి నివారణ ఒకటే మార్గం.. అందుకే కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: