క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్న సోనూ సూద్ ఇప్పుడు కూడా స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తున్నారు. తాజాగా సోను సూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న క‌రోనా పేషెంట్ ను ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో త‌ర‌లించారు.
భారతి అనే అమ్మాయి క‌రోనా బారిన ప‌డటంతో దాదాపు 85-90% ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. సోను ఆమెను చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ అనే ఆసుపత్రికి తరలించారు. అయితే అక్క‌డి వైద్యులు ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని చెప్పారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నాడు. దీనిలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు.  


ఈ ECMO చికిత్స కోసం మొత్తం నాగ్ పూర్ నుండి 6 మంది వైద్యులతో ఒక రోజు ముందుగానే రావాలి.  ఇందుకోసం సోనూ సూద్ ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఇక హైద‌ర‌బాద్ కు చేరుకున్న బాధితురాలికి అపోలో వైద్యులు ట్రీట్మెంట్ కూడా మొద‌లు పెట్టారు. ఇదిలా ఉండ‌గా చికిత్స చేయిస్తే భార‌తి బ్ర‌తికేందుకు 20 శాతం అవ‌కాశం ఉంది. అయిన‌ప్ప‌టికీ సోనూసూద్ ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేసి అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అంతే కాకుండా ఆమె త్వ‌ర‌గా కోలుకుంటుంద‌ని సోనూసూద్ దీమా వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా విమానంలో క‌రోనా పేషెంట్ ను చికిత్స కోసం త‌ర‌లించ‌డం భార‌త్ లోనే ఇది మొద‌టి సారి కావ‌డం విషేశం. మ‌రోవైపు సోనూసూద్ కు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయిన్ప‌టి సోనూ హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటూ కరోనా భాదితుల‌కు అండగా ఉంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: