స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... కాదు కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుండి ఐటమ్ స్టార్ గా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే.. పుష్ప సినిమాలో ఆయన చేసిన పనికి గాను సుకుమార్ ఆయనకు ఈ బిరుదు అంకితం చేశారు.. అల్లు అర్జున్ కూడా అందుకు తగ్గట్లే గత కొన్ని రోజులుగా ప్రవర్తిస్తుండడం విశేషం. ప్రస్తుతం పుష్ప సినిమాలో చేస్తున్న అల్లు అర్జున్ కెరీర్లో ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు..

 వాటిలో ఏ సినిమా ఆయనను ఈరేంజ్ తీసుకు వచ్చిందో చెప్పడం చాలా కష్టమైనా బన్నీని ఓ లెవెల్ లో చూపించిన సినిమా మాత్రం ఒకటి ఉందని చెప్పొచ్చు.. గంగోత్రి సినిమా తో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన నా అల్లు అర్జున్ అంతకుముందు కొన్ని సినిమాల్లో పాత్రలు చేశారు.. రెండో సినిమా ఆర్య తోనే తనలోని స్టైల్ ని ప్రేక్షకుల కు పరిచయం చేశాడు.. అప్పటి నుంచి అల్లు అర్జున్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.. ఆయన సినిమాలు వరుసగా హిట్ అవుతూ వచ్చాయి.. అందుకే ఆయన ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అని చెప్పవచ్చు..

బన్నీ కెరీర్లో క్లాస్ సినిమాలుగా సన్నాఫ్ సత్యమూర్తి , అల వైకుంఠ పురం లో సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసి ఫ్యామిలీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ దగ్గర అయ్యేలా చేశాడు.. ఇక మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ బోయపాటి శీను తో సరైనోడు, సురేందర్ రెడ్డి తో రేస్ గుర్రం చేశారు.. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. ఏదేమైనా బన్నీని ఈరేంజ్ తీసుకొచ్చిన సినిమా మాత్రం సరైనోడే.. అయితే అల్లుఅర్జున్ మాత్రం తనను ఈ రేంజి తీసుకొచ్చిన సినిమా సరైనోడు అనే క్రెడిట్ మాత్రం ఎక్కడ ఇవ్వలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: