ఊర మాస్ దర్శకుడు బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ అనగానే సక్సెస్ ఫుల్ కాంబో అని టక్కున చెప్పేస్తారు. అంతగా వీరి కాంబినేషన్ కు గుర్తింపు దక్కింది. వీరి కాంబోలో సింహా ,లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కగా... ఇప్పుడు హ్యాట్రిక్ తో వస్తున్న సినిమా "అఖండ". ద్వారకా క్రియేషన్స్ పతాకంపై  ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక థమన్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అయితే ఇటీవలే ఉగాది పండుగ ( ఏప్రిల్ 13న)  కానుకగా అఖండ చిత్రం నుంచి టీజర్ ని విడుదల చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ లో బాలయ్య హర హర మహాదేవ శంభోశంకర అంటూ... చెప్పిన డైలాగ్ ఓ రేంజ్ లో ఉంది. ఇక టీజర్ కి థమన్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు మించి ఉందంటూ ప్రశంసలతో ముంచెత్తారు. 

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తన సత్తా చాటుతోంది. మునుపెన్నడూ లేని గెటప్ లో బాలయ్య అభిమానులను ఆశ్చర్యపరిచాడు, టీజర్ లో ఆయన చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ వీక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాయి. థమన్ అందించిన సంగీతం మరింత ప్లస్ గా నిలిచింది. ఇక టైటిల్ చూస్తే ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ని టీజర్ లో చూపి తన ప్రతిభను మరోసారి కనబర్చారు బోయపాటి. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో సంచలనంగా మారింది. ఇప్పటికే 35 మిలియన్లకు పైగా వ్యూస్ ని దాటి 390K+ లైక్స్ ను సొంతం చేసుకొని వాయు వేగంతో దూసుకుపోతోంది. ఇదే స్పీడ్ తో మరికొద్ది రోజుల్లోనే అఖండ టీజర్.... రజినీకాంత్ మూవీ కబాలి చిత్ర టీజర్ రికార్డును బ్రేక్ చేస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.

కబాలి చిత్రం ఇప్పటివరకు 37 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకొని.. సౌత్ లో భారీ స్థాయిలో మెజారిటీ వ్యూస్ అందుకున్న  చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు బాలయ్య అఖండ చిత్ర టీజర్ స్పీడ్ చూస్తుంటే అనతికాలంలోనే... ఆ రికార్డును బద్దలు కొట్టేలా కనిపిస్తోంది అంటున్నారు. ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న అఖండ టీజర్ ని చూసి జై బాలయ్య జై జై బాలయ్య అంటూ... ఉరకలు వేస్తున్నారు ఫ్యాన్స్. సమ్మర్ కానుకగా మే 28 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. మరి ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: