ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ లో బాగా గుర్తింపు సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా ఆయన తెరకెక్కించిన గోదావరి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆపై అందరూ కొత్త నటులతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా హ్యాపీడేస్. అప్పట్లో భారీ విజయం అందుకున్న ఈ సినిమా తర్వాత దర్శకుడిగా శేఖర్ కమ్ముల మరింత గొప్ప క్రేజ్ ని దక్కించుకున్నారు.

అలానే ఆ పై వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో కూడా బాగా పేరు దక్కించుకున్న శేఖర్ కమ్ముల ఇటీవల సాయి పల్లవి, వరుణ్ తేజ్ ల కలయికలో రూపొందించిన సినిమా ఫిదా. లవ్ కం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని దర్శకుడిగా శేఖర్ స్థాయిని మరింతగా పెంచింది. దాని అనంతరం ప్రస్తుతం శేఖర్ రూపొందిస్తున్న సినిమా లవ్ స్టోరీ. తొలిసారిగా నాగచైతన్య, సాయి పల్లవి ల కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సిహెచ్ పవన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి విడుదలైన సాంగ్స్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా మంగ్లి ఆలపించిన సారంగదరియా సాంగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేడీ ఓరియంటెడ్ సాంగ్ గా కొనసాగిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో భారీ వ్యూస్ దక్కించుకుంటూ నేడు ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ కి చేరుకుంది. దానితో లవ్ స్టోరీ సినిమా పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 16న విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా ఉండటంతో తమ మూవీ విడుదల వాయిదా వేస్తున్నాం అతి త్వరలోనే తాజా తేదీని ప్రకటిస్తామని లవ్ స్టోరీ యూనిట్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: