తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా అందాల రాక్షసి మూవీ ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. వారాహి చలన చిత్రం బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకుడు. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో తన ఆకట్టుకునే అందం అభినయంతో తెలుగు ఆడియన్స్ నుంచి మంచి పేరు దక్కించుకుంది లావణ్య. ఆ తర్వాత విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన దూసుకెళ్తా మూవీ లో కూడా హీరోయిన్ గా నటించి బాగా పేరు దక్కించుకున్న లావణ్య త్రిపాఠి ఆపై నాని హీరోగా మారుతి తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ మూవీతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు.

ఇక ఇటీవల అంతరిక్షం, అర్జున్ సురవరం, ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించిన లావణ్య ప్రస్తుతం మరిన్ని సినిమా అవకాశాలతో కొనసాగుతున్నారు. ఇక ఇతర నటీనటుల మాదిరిగానే తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన సినీ వ్యక్తిగత విషయాల గురించిన సమాచారాన్ని ప్రేక్షకాభిమానులతో పంచుకునే అలవాటు గల లావణ్య ఎప్పటికప్పుడు పలు ఫోటోషూట్స్ లో దిగిన ఫోటోలను కూడా వాటిలో పొందుపరుస్తుంటారు.

ఆ విధంగా నేడు ఆమె దిగిన ప్రత్యేక ఫోటో షూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో అదరగొట్టే అందంతో మెరిసిపోతున్నఆ ఫోటోల్లో లావణ్య ఎంతో బాగున్నారని అలానే ఆమె రాబోయే రోజుల్లో హీరోయిన్ గా మరిన్ని సక్సెస్ లు అందుకోవాలని కోరుకుంటూ పలువురు నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమెకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఇక అతి త్వరలో తన రాబోయే సినిమాలతో లావణ్య మరిన్ని సక్సెస్ లు కనుక అందుకుంటే హీరోయిన్ గా ఆమె క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా పెరగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: