టాలీవుడ్ సీనియర్ యాక్టర్ వెంకటేష్ ఇటీవల కెరీర్ పరంగా వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న నారప్ప కాగా మరొకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో నటుడు వరుణ్ తేజ్ కలిసి ఆయన చేస్తున్న సినిమా ఎఫ్ 3. ముందుగా నారప్ప గురించి మాట్లాడుకోవాలంటే ఇటీవల తమిళ్ లో ధనుష్ హీరోగా విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టిన అసురన్ కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా ప్రియమణి నటిస్తుండగా ఈ సినిమాని వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ లు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. మంచి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దీనిని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్.

ఇక ఈ సినిమా మే 14న విడుదల కానుంది. అలానే దీనితోపాటు వెంకీ నటిస్తున్న ఎఫ్3 సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తుండగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రూపొందిస్తున్న ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఎఫ్2 మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ ఇసినిమాలో మొదటి భాగాన్ని మించేలా మరింత ఫన్ ఉండేలా దర్శకుడు అనిల్ రావిపూడి దీనిని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారని తప్పకుండా రిలీజ్ తర్వాత ఈ ఎఫ్3 మూవీ భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని ఆగస్ట్ 27న విడుదల చేయనున్నారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే పలు సినిమాలన్నీ ఒక దాని వెంట మరొకటి వాయిదా పడుతున్నాయి. అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే వెంకీ నటిస్తున్న నారప్ప వాయిదా పడగా ఆగస్టులో రానున్న ఎఫ్3 కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. కాగా మేలో రావాల్సిన సినిమాలు ఆగస్టుకి వాయిదా పడటంతో ఎఫ్ 3 సెప్టెంబర్ కి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తంగా ఈ కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ పై భారీగానే ప్రభావం చూపిందని అంటున్నారు విశ్లేషకులు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: