టాలీవుడ్ లో ప్రస్తుత తరంలో మెగాస్టార్ చిరంజీవి శిఖరాయమానమే. ఆయన రికార్డులు కానీ ఆయన పోషించిన పాత్రలు కానీ ఎవరూ చేయలేరేమో అన్న చర్చ అయితే ఎప్పటికీ ఉంటుంది. ఇక చిరంజీవి 150 సినిమాలకు పైగా నటించి టాలీవుడ్ లో తానే టాప్ ర్యాంకర్ ని అని మరోసారి రుజువు చేసుకున్నాడు.

ఇక చిరంజీవి ఇప్పటికీ నాటౌట్ అంటూ నటిస్తూనే ఉన్నాడు. ఆరున్నర పదుల వయసులో కూడా మెగాస్టార్ లో ఎక్కడా అలుపూ సొలుపూ లేదు. ఆయన ఇప్పటికీ డ్యాన్సులు అదరగొడుతూనే ఉన్నారు. ఫైట్స్ లో తన స్టామినా చూపిస్తూనే ఉన్నారు. ఆయన డైలాగ్ డిక్షన్ విషయంలో  వంక పెట్టలేని తీరు ఉంటుంది. ఆ గొంతు అలాగే ఇప్పటికీ  ఖంగు మంటూనే ఉంది. దీంతో మరింత కాలం మెగాస్టార్ టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తారు అనే చెప్పాలి.

మరి ఇంత నటన అనుభవం కలిగి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరు తెచ్చుకున్న చిరంజీవి డైరెక్షన్ చేయవచ్చు కదా అన్న చర్చ కూడా ఉంది. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ పట్టు సాధించిన చిరంజీవికి డైరెక్షన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.  అయితే చిరంజీవి మాత్రం దానికి ఎపుడూ సుముఖంగా లేరనే మాట వినవస్తోంది. ఆయన తన పని నటన మాత్రమే అని భావిస్తారుట.

డైరెక్షన్ విభాగంలో వేలు పెట్టడం కూడా ఆయన చేయరు. అయితే తన సినిమాల గురించి ముందే డైరెక్టర్లకు సలహాలూ సూచనలు మాత్రం ఇస్తూంటారు. సినిమా హిట్ కావాలి అన్న ఉద్దేశ్యంతోనే ఆయన మంచి సూచనలు చేస్తారు తప్ప తాను డైరెక్షన్ చేయాలని ఏ కోశానా ఆయనకు లేదు అని అంటారు. ఇక నటనలోనే తనకు ఆనందమని చిరంజీవి ఎపుడూ అంటూంటారు. అందుకే ఆయన ఎంతో మంది యంగర్ జనరేషన్ డైరెక్టర్లకు తనను డైరెక్ట్ చేసే చాన్స్ ఇస్తున్నారు తప్ప‌ తాను మాత్రం మెగా ఫోన్ పట్టడంలేదు. మరి చిరంజీవిని ఎన్నో పాత్రలలో చూసిన ఫ్యాన్స్ కి డైరెక్టర్ పాత్రలో మాత్రం బహుశా చూసే అవకాశం అయితే ఉండకపోవచ్చు అనే అంటున్నారు.  చూడాలి మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: