ఇంటర్నెట్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫూల్ బిజీ అయిపోయాడు. తెలుగు, హిందీ ఇండస్ట్రీల్లో వరుస ప్యాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్నాడు. ఇప్పటికే తెలుగు దర్శకులతో దాదాపు రెండు సినిమాలు, కన్నడ దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక బాలీవుడ్‌లో ఓం రవుత్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ఇతిహాస గాధ రామాయణం నేపథ్యంలో ఓ సినిమాలో రాముడిగా కనిపించబోతున్నాడు. అసలే బాహుబలితో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఇక ఏకంగా రాముడిగా కనిపించబోతుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. తాజాగా వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేలా ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ గాసిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆదిపురుష్ సినిమా ప్రతిష్ఠాత్మకంతా తెరకెక్కుతుండడంతో డైరెక్టర్ దీనిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట. దేశం మొత్తం దేవుడిగా కొలిచే రాముడి పాత్ర ఆధారంగా తెరకెక్కుతుండడంతో ప్రతి చిన్న విషయంపై కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళుతున్నాడట. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఓం రవుత్ రీసెర్చ్ చేశాడట. వేల సంవత్సరాల కిందటి కథను ఎంత జాగ్రత్తగా తిసేందుకు ఈ రీసెర్చ్‌‌నే ప్రామాణికంగా అతడు తీసుకుంటున్నాడట.

ఇది మాత్రమే కాకుండా.. కేవలం రాముడు, సీత, రావణుడే కాకుండా.. రామాయణంలో కీలకమైన ప్రతి ఒక్క పాత్రను ఈ సినమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. దీనికోసం క్యాస్టింగ్ ఎంపిక పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడన్నమాట. మరి ఈ ప్రయత్నంలో ఓం రవుత్ ఏ మేర సక్సెస్ అవుతాడో చూడాలి.

ఇదలా ఉంటే ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ కనిపించబోతుండగా.. సీతగా కృతి సనన్, లక్ష్మణుని పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రామాయణంలో ఎంతో కీలమైన రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ మెరవనున్నాడు. ఇక మిగతా పాత్రల్లో ఎవరిని తీసుకుంటారో ఇప్పటికి సస్సెన్స్‌గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: