ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ ఎప్పుడూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడివయాలో తెగ హల్‌ల్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ట్విట్టర్‌లో ఆమె చేసే ట్వీట్లు చాలా వివాదాస్పదం అవుతుంటాయి. అనేకమంది ఆమె ట్వీట్లపై మండిపడుతుంటారు. ఇంకొంతమంది దూషిస్తుంటారు. మరికొంతమంది ఏకంగా కోర్టులకు కూడా ఎక్కుతుంటారు. అయితే తాజాగా ఆమె చేసిన ఓ ద్వేషపూరితమైన ట్వీట్‌తో ఆమెకు ట్విట్టర్‌కు రుణం తీరిపోయింది. ఆమెను శాశ్వంతంగా బ్యాన్ చేస్తున్నట్లు ట్విట్టర్ తాజాగా ప్రకటించింది.

కాగా.. కంగనను ట్విట్టర్‌ బ్యాన్ చేయడంతో ఇప్పుడు ఆమె అదే ట్విట్టర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు కంగనతో పాటు హృతిక్ రోషన్ కూడా వైరల్ అవుతున్నాడు. అదేంటి..? అంటారా.. కంగన బ్యాన్ అయితే హృతిక్ ఎందుకు మధ్యలోకొచ్చాడా..? అని అనుమానం కలుగుతోంది కదా. హృతిక్ రోషన్-కంగన మధ్య ఎప్పటినుంచో వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. హృతిక్‌పై ఇప్పటికే కంగన అనేకసార్లు ఆరోపణలు కూడా చేసింది.

ఈ క్రమంలోనే నెటిజన్లు హృతిక్-కంగనల ఫోటోలతో మీమ్స్ క్రియేట్ చేసి ట్విటర్‌లను తెగ షేర్ చేస్తున్నారు. జోకులు, మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. అందులో ఓ యూజర్..‘అక్కడ ట్విట్టర్ బ్లాక్ అవ్వగానే హృతిక్ గాల్లో తేలాడు. ఎగిరి గంతులేశాడు’ అని ఓ మీమ్‌ను షేర్ చేశాడు. దానికి క్రిష్ సినిమాలోని వీడియోను జతచేయడంతో తెగ ట్రెండ్ అయింది. ఇక మరో యూజర్ ‘కంగన ట్విట్టర్ బ్యాన్ చేయగానే.. హృతిక్ నేరుగా వెళ్లి ట్విట్టర్ బాస్‌ని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకున్నాడం’టూ మరో మీమ్ వైరల్ అయింది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో మీమ్స్, ఎమోజీస్ తెగ షేర్ అయ్యాయి. దీంతో పాటు కంగనతో ఎప్పుడూ మాటకు మాట జవాబిచ్చే శివసేన నేత సంజయ్ రౌత్‌పై కూడా జోకులు పేలాయి.

ఇదిలా ఉంటే ట్విట్టర్‌లో బ్యాన్ కావడంతో కంగనా తన అభిప్రాయాలను వినిపించడానికి ఇతర ప్లాట్ ఫామ్‌లను వినియోగిస్తోంది. ట్విట్టర్ ఆమెను బ్యాన్ చేయడాన్ని ఖండిస్తూ కూడా పోస్టులు పెట్టినట్లు సమాచారం. మరి అక్కడ కూడా ఆమెపై సదరు ఫ్లాట్ ఫాంలు ఏమైనా చర్యలు తీసుకుంటాయేమో చూడాలి













మరింత సమాచారం తెలుసుకోండి: