టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డీజే, దువ్వాడ జగన్నాథం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. రిలీజ్ అనంతరం ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ముఖ్యంగా ఇందులో సీటీ మార్ అనే డ్యాన్సింగ్ నంబర్ కి అందరి నుండి మరింత రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్స్ లో అల్లు అర్జున్ సూపర్ స్టెప్స్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ఈ ఎనర్జిటిక్ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ అదరహో అనే చెప్పాలి. అయితే ఈ సాంగ్ విని ఎంతో నచ్చిన వారిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. అయితే అంతటితో ఆగని సల్మాన్ ఆ సాంగ్ ని ఏకంగా తన లేటెస్ట్ ఫిలిం రాధే లో దేవిశ్రీ తో రీమిక్స్ చేయించడం జరిగింది.

అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సాంగ్ లో వేసిన స్టెప్స్ ని మెచ్చుకుంటూ ఇటీవల సల్మాన్ తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేయడం, దానికి అల్లు అర్జున్ ఎంతో ఆనందంతో రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక అసలు విషయం ఏమిటంటే, రాధే మూవీలోని ఈ సీటీ మార్ వీడియో సాంగ్ ని ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మూవీ యూనిట్. విడుదలైన క్షణం నుండి యూట్యూబ్ ని ఎంతో ఊపేస్తున్న ఆ సాంగ్ ప్రస్తుతం ఏకంగా 100 మిలియన్ వ్యూస్ అందుకుని అతి తక్కువ సమయంలో ఈ స్థాయి భారీ వ్యూస్ అందుకున్న సాంగ్ గా సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఈ సాంగ్ కి భారీ రెస్పాన్స్ రావడం రాధే మూవీ సక్సెస్ కి మరింత ప్లస్ అవుతుందని అంటోంది మూవీ యూనిట్. కాగా ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేయనున్నారు.... !!


మరింత సమాచారం తెలుసుకోండి: