సినీ ఇండస్ట్రీలో రామ్‌గోపాల్ వర్మ అంటే ఓ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆర్జీవీ ఎవరినైనా విమర్శిస్తాడు. ఎవరిపైనైనా కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తాడు. అతడికి ప్రధాని అయినా ఒకటే.. సామాన్యుడైనా ఒకటే. అందుకే ఆయనంటే కొందరికి పడదు. కానీ ఇంకొందరికి మాత్రం ఆయనంటే ఎంతో ఇష్టం. రాముయిజానికి వారు డైహార్డ్ ఫ్యాన్స్. అయితే ఎంత మంది ఫ్యాన్స్ అంటూ వచ్చినా, ఎంతమంది తిట్టినా ఆర్జీవీ మాత్రం ఏమీ పట్టించుకోడు. తాను చేయాల్సింది చేసుకుంటూ పోతుంటాడు. అదే తీరులో ప్రతి రోజూ ఎవరో ఒకరిపై వివాదాస్పద ట్వీట్లు చేయడం ఆర్జీవీకి అలవాటు. తాజాగా ఆర్జీవీ ప్రధాని నరేంద్ర మోదీపైనే ఓ ట్వీట్ చేశాడు. ఇది ప్రస్తుతం ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది.

తాజా ట్వీట్లో ఆర్జీవీ ప్రధాని గడ్డం గురించి చురకలంటించాడు. ‘సార్. మీరు అనుకున్నట్లుగా ఇప్పుడు మీ లుక్ పనిచేయడం లేదు. మీకనిపించడం లేదా..? వెంటనే గడ్డం తీసేయాలని..? అలాగే మీ ముఖంపై కొన్ని ప్రేదశాల్లో వెంట్రుకల కోసం లోరియల్ క్రీమ్ వాడి కొత్త అవతారంలో తిరిగి రావాలని..? అహా..! అడగాలనిపించిందంతే’ అని రాసుకొచ్చాడు. దీనికి గడ్డంతో ఉన్న ప్రధాని మోదీ ఫోటోను జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు కూడా విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఓ యూజర్ ‘నిజం చెప్పారు ఆర్జీవీ సర్’ అని కామెంట్ చేస్తే.. మరో యూజర్ ‘ఆ అవతారం కూడా మీరే డిజైన్ చేస్తే పోలా..’ అని రిప్లై ఇచ్చాడు. ఇక ఇంకో నెటిజన్ ఆర్జీవీ కామెంట్‌పై ఆర్జీవీనే ట్రోల్ చేశాడు. ‘కాకా.. 3 పెగ్గులేసినట్టువ్.. సీఎం నుంచి పీఎంకు వచ్చేసినవ్..’ అని కామెంట్ చేశాడు. మరో ఆర్జీవీ ఫ్యాన్ అయితే.. ‘సర్. మీరెప్పుడూ ‘జస్ట్ అడుగుతున్నానంతే..’ అంటూ ప్రశ్నలు సంధిస్తారు. కానీ అవి ఎదుటివారిని చెంప ఛెళ్లుమనిపించినట్లు ఉంటాయి’ అని ప్రశంసించాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: