విక్టరీ వెంకటేష్ గత కొంత కాలంగా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. గురు, ఎఫ్2, వెంకీ మామ వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదే జోష్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వెంకీ మూడు ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ తో గడిపేస్తున్నాడు. నారప్ప, దృశ్యం2, ఎఫ్3, వంటి సినిమాలను చేస్తున్నాడు. అయితే వీటిలో నారప్ప, దృశ్యం2.. సినిమాలు రీమేక్ సినిమాలే. తమిళ్ లో సంచలన విజయం సాధించిన దనుష్ " అసురన్ " మూవీని " నారప్ప " పేరుతో వెంకీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

ఇక "దృశ్యం2 " కూడా మలయాళం లో మోహన్ లాల్ నటించిన "దృశ్యం2" మూవీ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెంకీ మరో రీమేక్ మూవీ ని ఒకే చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. మలయాళం లో 2019 సూపర్ హిట్ గా నిలిచిన " డ్రైవింగ్ లైసన్స్ " సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రీమేక్ చేసేందుకు వెంకీ ఆసక్తి కనబరుస్తున్నాడని సమాచారం. అయితే ఈ మూవీ తెలుగు రీమేక్ పై గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట ఈ సినిమాను రవితేజ రీమేక్ చేస్తాడని వార్తలు వచ్చినప్పటికి కార్యరూపం దాల్చలేదు.

 ఇక ఈ రీమేక్ ప్రాజెక్ట్ వెంకీ వద్దకు చేరడంతో దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెంకీ తో పాటు మరో హీరోకి కూడా ఛాన్స్ ఉంది. ఒక సెలబ్రేటి తన డ్రైవింగ్ లైసన్స్ పోగొట్టుకుంటే సాధారణ కానిస్టేబుల్ గా ఉన్న తన అభిమాని మద్య జరిగే సంఘటనల నేపథ్యంలో " డ్రైవింగ్ లైసన్స్ " మూవీ ఉంటుంది. ఒక వేళ ఈ సినిమాను వెంకీ ఒప్పుకుంటే మరో హీరోగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: