గతేడాది కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి వారి చేత రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ప్రజలను కరోనా బారి నుండి కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక లాక్ డౌన్ కారణంగా వేలాది మంది కార్మికులు గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న సమయంలో వారిపాలిట దేవుడు అయ్యాడు. బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు.

ఇక అంతటితో సోను సాయం ఆగిపోలేదు. వేదికగా సాయం కోరిన ప్రతిఒక్కరికి తనవంతు సహాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలలనుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు. సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి.ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా క్రికెటర్ సురేశ్ రైనాకి కూడా కష్టకాలంలో సాయం అందించాడు సోనూసూద్.



అయితే క్రికెటర్ సురేశ్ రైనా, మీరట్‌లో ఉన్న 65 ఏళ్ల తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలంటూ ట్వీట్ చేశాడు. "మీరట్‌లో ఉన్న మా ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆమె వయసు 65 ఏళ్లు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు కోవిద్ కూడా ఉంది... దయచేసి సాయం చేయండి" అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు క్రికెటర్ సురేశ్ రైనా. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించకపోయినా సోనూ సూద్ వెంటనే స్పందించి, వివరాలు పంపాల్సిందిగా సురేశ్ రైనాను కోరారు. సురేశ్ రైనా, అతనికి ధన్యవాదాలు తెలిపి వివరాలు మెసేజ్ చేశాడు.

సోనూ సూద్ మరో పది నిమిషాల్లో ఆక్సిజన్ సిలిండర్ వస్తుందని రిప్లై ఇచ్చాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆమెకు కావాల్సిన ఏర్పాట్లు చేసేశాడు. " ఆక్సిజన్ సిలిండర్ అందింది. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా... అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా." అంటూ ట్వీట్ చేశాడు సురేశ్ రైనా. మొత్తానికి మరోసారి రియల్ హీరో అన్పించుకున్నాడు సోనూసూద్.

మరింత సమాచారం తెలుసుకోండి: