ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం " పుష్ప " సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై బన్నీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని బన్నీ లుక్స్ కామన్ ఆడియన్స్ ను కూడా ఆకర్షిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ఎంతటి సంచలన రికార్డులను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటెందుకు సిద్దమయ్యాడు.

ఇక ఈ సినిమా తరువాత బన్నీ చేసే సినిమాపై సందిగ్ధత నెలకొంది. మొదట బన్నీ  "పుష్ప " మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ ఆ సినిమా వాయిదా పడింది. దీంతో బన్నీ తర్వాతి చిత్రం కోసం పలువురు దర్శకులు పోటీ పడుతున్నారు. వారిలో వేణు శ్రీరామ్, అనిల్ రావిపూడి, వంటి దర్శకులు ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి తమిళ్ దర్శకుడు మురుగదాస్ కూడా చేరారు. ఈ దర్శకుడు బన్నీ తో గజిని సిక్వల్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేశాడట. ఇక త్వరలోనే స్టోరీ బన్నీ కి వినిపిస్తాడని సమాచారం.

 అయితే బన్నీ గత కొంత కాలంగా తమిళ్ దర్శకులకు షాక్ ఇస్తూనే ఉన్నాడు. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన బన్నీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పక్కనపెట్టాడు. అలాగే  "దేశ ముదురు " మూవీ టైమ్ లో కూడా తమిళ్ దర్శకుడు విష్ణువర్ధన్ తో ఓ సినిమా ఉంటుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. మళ్ళీ ఇప్పుడు బన్నీ తరువాతి మూవీ కోసం తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్ పేరు గట్టిగానే వినిపిస్తుంది. మరి ఈసారైనా బన్నీ తమిళ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా.. లేక షాక్ ఇస్తాడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: