ఇళయ తలపతి విజయ్ కి తమిళనాట ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తారు. క్షణాల్లో తమ హీరో అప్డేట్ ను ట్రెండింగ్ లో నిలుపుతారు. ఇక తమిళనాట విజయ్ సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. ఇక విజయ్ ఈ ఏడాది ఆరంభంలో " మాస్టర్ " సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

విజయ్ కి సూర్య, కార్తీ లతో పోలిస్తే తెలుగులో ఏమాత్రం క్రేజ్ లేదనే చెప్పుకోవాలి. మొట్టమొదటి సరిగా "తుపాకి" సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నప్పటికి ఆ తరువాత తెలుగులో చెపుకోదగ్గ స్థాయిలో రాణించలేదు. ఇక ఈ ఏడాది "మాస్టర్ " తో తెలుగులో మరొకసారి సత్తా చాటాడు. దాంతో తెలుగులో ఏర్పడ్డ ఈ క్రేజ్ ను నిలుపుకొనేందుకు విజయ్ తెలుగు స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కు " మహర్షి " వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లి ఇటీవలే విజయ్ కి కథ వినిపించడాని సమాచారం.

కథ బాగా నచ్చడంతో విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే విజయ్ కి ఈ సినిమా స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ ప్రాజెక్ట్ పట్టాలేక్కే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ఈ వార్త సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: