కోలీవుడ్‌లో భారీ స్టార్ డమ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకడు. అతడికి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతడి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే సూర్య చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ‘ఆకాశం నీ హద్దురా’ ప్రయోగానికి నాంది పలికాడు. సూర్య సినిమాపై భారీ నమ్మకంతో రూపొందించాడు. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా థియేటర్ రిలీజ్‌ నుంచి ఓటీటీ విడుదలకు వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీలోనూ ఆకాశపు హద్దులను దాటే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సూర్యకు విదేశాల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాతో సూర్య కెరీర్‌ హిట్‌ అందుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా ఇచ్చిన నూతనోత్సాహంతో సూర్య దూసుకెళ్తున్నాడు.

 అదే జోష్‌తో వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. ఆకాశం నీ హద్దురా చూసిన ప్రేక్షకులంతా సూర్య నుంచి ఇటువంటి మరెన్నో సినిమాలను ఆశిస్తున్నారు. అదే విధంగా సూర్య కూడా ఇంటరస్టింగ్ ప్రాజెక్ట్‌లను ఓకే చేశాడు. వీటిలో ఒక సినిమాను టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో సూర్య పవర్ ఫుల్ లాయర్‌గా కనిపించనున్నాడంట. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ఆన్‌లొకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన వకీల్‌సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా ఓ పవర్ ఫుల్ లాయర్ గెటప్‌లోనే కనిపించాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ లాయర్‌ ఎలా ఉంటాడని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. మరి సూర్య చేస్తున్న సినిమాలో లాయర్ ఎలా ఉంటాడని ప్రేక్షకులు ఊహాగానాలు ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సినిమాలో సూర్య లుక్స్‌ ఎలా ఉంటాయో చూడాలని ఉవ్విళ్లూరిపోతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: