సీరియల్ నటిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమా యాక్టర్‌గా మారి.. ఇప్పుడు యాంకర్‌గా స్థిరపడిపోయింది శ్యామల. ఎప్పుడో పరిచయమైన ఈమె.. సుదీర్ఘ కాలంలో ఎన్నో విధాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఫుల్ ఫేమ్ అయిన ఈ భామ.. వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో రాజకీయాల్లోనూ మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. శ్యామల.. ‘లయ', ‘అభిషేకం' వంటి సీరియల్స్‌తో బాగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత యాంకర్‌గా మారిపోయి కొన్ని షోలు చేసింది. ఇందులో ‘మా ఊరి వంట', ‘పట్టుకుంటే పట్టుచీర' కార్యక్రమాలతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వీటితో పాటు ‘లౌక్యం', ‘ఒక లైలా కోసం', ‘గుండెల్లో గోదారి' సహా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే వారం క్రితం తన భర్త విషయంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. ఆ ఘటనలో శ్యామల మాత్రం తన భర్తను వెనకేసుకుని వచ్చారు. ఆయన అలాంటి వారు కాదని, మహిళలను మోసం చేసే అవసరం లేదంటూ శ్యామల చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే శ్యామల ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లతో బాగానే డబ్బులు సంపాదిస్తున్నారనే చెప్పొచ్చు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్యామల నిత్యం తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. తన కుమారుడు ఇషాన్‌తో కలిసి చేసే అల్లరి, కోతి చేష్టలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా శ్యామలపై వచ్చిన ఓ మీమ్ మీద
ఆమె ఓ సరదా సెటైర్ వేశారు. ఇండియన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. భువనేశ్వర్ కుమార్, యాంకర్ శ్యామలకు దగ్గరి పోలికలుంటాయని అందరూ అంటుంటారు. అలా భువనేశ్వర్ కుమార్, యాంకర్ శ్యామల బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారేమో అని ఓ మీమ్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. అందులో..మీకు తెలుసా? భువనేశ్వర్ కుమార్, యాంకర్ శ్యామల బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు? అంటూ ఇద్దరి ఫోటోలను ఒకే చోటుకు చేర్చారు. అలా వచ్చిన మీమ్ మీద యాంకర్ శ్యామల స్పందించారు. మేం బ్రదర్ అండ్ సిస్టర్ అవుతామని నాకే తెలియదు, వాళ్లకు ఎలా తెలుస్తుందండి అని శ్యామల కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారి హల్ చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: