మనుషులకైతే మంచి చెడ్డా..మనోడు పగోడు ఉంటాయి. కానీ వైరస్ కి అలా కాదు ఏ బాడీ అయినా ఒకటే. అండర్ వరల్డ్ డాన్ నుండి అండర్ వేర్ వేసుకొని బుడ్డోడి వరకూ ఎవరికనైనా పట్టేస్తుంది.    ఇక తాజాగా మహమ్మారి వైరస్  అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ పై కూడా ప్రభావాన్ని చూపింది. తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్న చోటారాజన్ ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. దాంతో జైలులోనే చికిత్స చేసినప్పటికీ ఆయన కొలుకోలేదు. దాంతో రాజన్ ను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చోటారాజన్ చికిత్స పొందుతూ మరణించారని వార్తలు వచ్చాయి. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చోటా రాజన్ మృతి చెందారంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ లో "కరోనా వైరస్ చోటా రాజన్ ను చంపేసింది. ఆయన డీ కంపెనీలో రెండో వ్యక్తి అని కూడా పట్టించుకోలేదు. 

అతడు వైరస్ ను ఎందుకు షూట్ చేయలేదా అని షాక్ అవుతున్నా..సీరియస్లీ ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఎలా ఫీల్ అవుతున్నారో" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా ముఖ్యంగా వర్మ ట్వీట్ తోనే చోటారాజన్ మరణించాడన్న వార్త నెట్టింట హల్చల్ చేసింది. అంతే కాదు పలు న్యూస్ ఛానల్స్ సైతం చోటా రాజన్ ఇక లేరు అంటూ బ్రేకింగ్ లు వేసాయి. అయితే ఆ వార్తలకు ఢిల్లీ ఎయిమ్స్ చెక్ పెట్టేసింది. చోటా రాజన్ చనిపోలేదని..ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. దాంతో అప్పటివరకు రాజన్ చనిపోయాడనుకున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంత పని చేసావయ్యా ఆర్జీవి బతికుండగానే అండర్ వరల్డ్ డాన్ ను లేపాసావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు అండర్ వరల్డ్ డాన్ ను లేపేసావ్ జాగ్రత్త వర్మ అంటున్నారు. అంతే కాదు వర్మకు అండర్ వరల్డ్ డాన్ అయినా అండర్ వేర్ అయినా ఒకటే అని జోకులు పేలుస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: