తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ కు బాగా అలవాటు పడ్డారు. నిజానికి మొదటి సీజన్ మొదలుపెట్టక ముందు ఇలాంటి షోను తెలుగు వాళ్లు ఆదరిస్తారా లేదా అనే అనుమానాలు బిగ్ బాస్ నిర్వాహకుల్లో ఉండేవి.. కానీ మొదటి సీజన్ ను ఆదరించిన విధానం చూసి వాళ్ళు రెండు మూడు నాలుగు సీజన్లు కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగారు. అయితే ఇప్పుడు ఐదో సీజన్ మీద తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది. నిజానికి గత ఏడాది కరోనా కారణంగా నాలుగో సీజన్ చాలా లేటుగా మొదలైంది.. ఇలాంటి అవాంతరాలు ఎదురవుతాయి ఏమో అనే ముందుచూపుతో జూన్ నెలలో ఈ షో మొదలు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. 


అనూహ్యంగా వచ్చిపడిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో మొదలవుతుందో లేదో అనే టెన్షన్ మొదలైంది.  ఆగస్టు నుంచి ఈ షో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంటే కరోనా కేసులు తగ్గకపోతే అసలు ఈ ఏడాది పూర్తిగా షో రద్దు చేయడానికి కూడా నిర్వాహకులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఆగస్టు నుంచి మొదలు పెడితే గత సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


గత నాలుగు సీజన్లలో మొదటి సీజన్ కు శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. రెండో సీజన్ లో కౌశల్ విన్నర్ గా నిలిచారు. మూడవ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలవగా చివరి నాలుగో సీజన్లో అభిజిత్ విన్నర్ గా నిలిచారు. ఇక ఈ ఐదో సీజన్ మాత్రం జరుగుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మే 15 నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలా జరిగితే ఆగస్టు నుంచి అయినా ఈ షో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: