బుల్లితెర యాక్టర్ మేఘనా లోకేష్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె శశిరేఖా పరిణయం సీరియల్ లో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. శశి బిటెక్ అంటూ పేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమవుతున్న కల్యాణ వైభోగం సీరియల్, రక్త సంబంధం సీరియల్ లో నటిస్తుంది. మేఘనా లోకేశ్‌కు బుల్లితెర ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లితెర పై పరిచయం అయిన మేఘన లోకేష్‌ ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో బిజీగా ఉంది

 మేఘనా లోకేష్ కల్యాణ వైభోగం సీరియల్ లో హీరోయిన్, విలన్ పాత్రను కూడా ఆమె చేస్తుంది. ఇక ఈ సీరియల్ లో మంగగా క్యారెక్టర్ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ సీరియల్ లో మంగ -జై క్యారెక్టర్ ముగిసిపోవడంతో దివ్య క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మేఘనా లోకేష్ దేవి, పవిత్ర బంధం, పురుషోత్తమ వంటి కన్నడ సీరియల్స్ లో చేసి, అక్కడి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక మేఘనా తెలుగులో శశిరేఖా పరిణయంతో ఎంట్రీ ఇచ్చింది. రక్త సంబంధం సీరియల్ లో కూడా చేస్తోంది. ఇక కల్యాణ వైభోగం సీరియల్ తో మంచి సక్సెస్ అందుకుంది. యాంకర్ రవితో ఇది మా ప్రేమ కథ మూవీలో చేసినా సక్సెస్ రాలేదు. అయితే రక్త సంబంధం సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్లింది. ఇక జి తెలుగులో ప్రసారమవుతున్న సూర్యకాంతం సీరియల్ లో అనూష హెగ్డే హీరోయిన్ పాత్రలో మెప్పిస్తోంది.

అనూష హెగ్డే ఐపీఎస్ కావాలని కోచింగ్ తీసుకోగా, రాయలేక పోయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఆమె కొన్ని సీరియల్స్ కి కొరియోగ్రఫీ చేసింది. రాధారమణ అనే కన్నడ సీరియల్ లో నటించింది. నిన్నే పెళ్లాడతా సీరియల్ లో మానసి పాత్రలో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కొన్నాళ్ళు ఆరోగ్య కారణాల వలన నిన్నే పెళ్లాడతా సీరియల్ నుండి అనూష హెగ్డే తప్పుకుంది. ఆ తరువాత ఈమె సూర్యకాంతం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. కానీ కల్యాణవైభోగం సీరియల్ ని రిజెక్ట్ చేసింది. అలా మేఘనా లోకేష్ కి అవకాశం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: