గతేడాది చైనా పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడ లాడించింది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఈ మహమ్మారి బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఈ వైరస్ బారి నుండి ప్రజలను కాపాడుకోవడనికి దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు హీరోలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించారు.

ఇక ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. గతేడాది కంటే ఇప్పుడు ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య ఎక్కవవుగా ఉంది. అయితే గతేడాది లాక్‌డౌన్‌లో సల్మాన్‌ఖాన్‌తో కలిసి పేదలకు నిత్యావసర వస్తువులు పంచి, పలు సేవా కార్యక్రమాల్లో భాగమయ్యారు బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌. మరోసారి తన మానవత్వాన్ని నిరూపించుకున్నారామె. యోలో పేరుతో ఓ ఫౌండేషన్‌ ప్రారంభించి, పేద కార్మికులకు, మూగ జీవాలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు.


కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో వలస కార్మికులు పనులు లేక తినడానికి తిండి లేక ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో జాక్వలైన్‌ ఓ ఎన్జీవో సంస్థతో కలిసి ఢిల్లీలో గురువారం వలస కార్మికులకు ఆహారం పంపణి చేశారు. తానే స్వయంగా దగ్గరుండి వండిండి, వడ్డించడం విశేషం.


ఇక జాక్వలిన్‌ చేస్తున్న సేవను చూసి  బాలీవుడ్‌ ప్రముఖులు అభినందిస్తున్నారు. ‘‘ఆకలిగా ఉన్న వారి ఆకలి తీర్చడంతోనే ప్రశాంతత మొదలవుతుందనే మదర్‌ థెరిస్సా మాటలు గుర్తొచ్చాయని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. ముఖ్య నగరాల్లో ఆకలి అన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామని జాక్వలిన్‌ తెలిపారు. మరో నాయిక సన్నీలియోన్‌ కూడా గురువారం ఉదయ ఫౌండేషన్‌తో కలిసి దాదాపు పది వేల మంది వలస కార్మికులకు ఆన్నదానం చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: