టాప్ హీరోలు అనేకసార్లు తామంతా ఒకటే అని తమమధ్య ఎలాంటి పోటీ అదేవిధంగా ఎలాంటి ఇగోలు ఉండవని అందువల్ల ఎదో ఊహించుకుని తమ అభిమానులు కలవర పడవద్దు అని చెపుతూ తమ అభిమానులను అందరి హీరోల సినిమాలను చూడమని చెపుతూ ఉంటారు. అయితే ఈవిషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా టాప్ హీరోల అభిమానులు తమ హీరో మాత్రమే గొప్ప అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు.


సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక ఈప్రచారం మరింత పెరిగిపోయింది. ఒక హీరో అభిమానులు మరొక హీరోను ట్రోల్ చేయడం ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు ఈట్రెండ్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ యూనిట్ లేటెస్ట్ గా విడుదల చేసిన కరోనా జాగ్రత్తలకు సంబంధించిన ప్రచార వీడియోని కూడ వెంటాడటం ఆశ్చర్యంగా మారింది.


‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ చరణ్ లు కలిసి నటిస్తున్న పరిస్థితులలో ఈమూవీలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది అన్న చర్చలు జూనియర్ చరణ్ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రాజమౌళి మాత్రం ఈమూవీలో చరణ్ జూనియర్ లు కనిపించరనీ వారు నటించే అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ పాత్రలను మాత్రమే చూడమని చెపుతూ చరణ్ జూనియర్ అభిమానుల అత్యుత్సాహానికి అడ్డు కట్ట వేస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ విడుదల చేసిన కరోనా ప్రచార వీడియో మళ్ళీ చరణ్ జూనియర్ అభిమానుల మధ్య అనవసరపు చర్చలకు తావు ఇస్తోంది. ఈవీడియోలో అలియా భట్ తెలుగులో రామ్ చరణ్ తమిళంలో జూనియర్ కన్నడంలో రాజమౌళి మళయాళంలో అజయ్ దేవగన్ హిందీలో ప్రజలను ఈ కరోనాసేకండ్ వేవ్ పరిస్థితుల నుండి ఎవరికు వారే జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోమని చెప్పిన మాటలు ఉన్నాయి. అయితే ఈ వీడియోలో జూనియర్ అనర్గళంగా కన్నడంలో మాట్లాడిన తీరు అందరికీ బాగా నచ్చింది. దీనితో చరణ్ కన్నా జూనియర్ కు ఈ విషయంలో ఎక్కువ మార్కులు పడ్డాయి అంటూ తారక్ అభిమానులు చేస్తున్న ప్రచారం మళ్ళీ జూనియర్ చరణ్ అభిమానుల మధ్య అనవసరపు రగడను క్రియేట్ చేస్తోంది..





మరింత సమాచారం తెలుసుకోండి: