కొంతమంది హీరోయిన్ లు ఎన్ని సినిమాలు చేసినా కూడా వారి అందం ఏమాత్రం తగ్గదు.. వయసు పెరిగిపోతున్నా వారి అంద చందాలు చెక్కు చెదరకుండా ఉంటాయి.. అలాంటి హీరోయిన్ లలో ఒకరు ఆండ్రియా.. తమిళ సినిమాల్లో బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు ఆమె.. కళ్ళతోనే మత్తెక్కించే ఆండ్రియా తెలుగు వారికి సుపరిచయమే.. కొన్ని డబ్బింగ్ సినిమాల్లో ఈ బ్యూటీ మెరిసింది..ముఖ్యంగా సిద్ధార్థ్ హీరో గా నటించిన గృహం సినిమాలో సిద్ధార్థ్ తో కలిసి మంచి హాట్ షో కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో మూతి ముద్దులతో పాటు బెడ్ రూమ్ సీన్స్ లో కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది ఆమె.

తనదైన అందం, అభినయంతో తెలుగు వారి అభిమానాన్ని చూరగొంది.. కోలీవుడ్ లో ఈమెలా బోల్డ్ గా నటించే నటి లేదని చెప్పొచ్చు.. ఎలాంటి పాత్ర నైనా తనదైన స్టయిల్ లో అందాలు ఆరబోస్తూ నటించేసి అభిమానులను ఆకర్షిస్తుంది. ఇక సోషల్ మీడియా లో అందాలతో ఆమె చేసే హడావుడి అంతా ఇంతా కాదు..ఆమె అందంతో కుర్రకారు ను పిచ్చెక్కిస్తోంది..రోజుకో హాట్ ఫోటో ను పెట్టి ప్రేక్షకులు మర్చిపోకుండా చేస్తుంది.    అయితే ఆమెకున్న ఎఫైర్లు కూడా ఆమె చేసే సినిమాల్లాగే ఎక్కువే.. అనిరుద్ తో లిప్ లాక్ ఇస్తూ లీక్ అయినా ఫోటో ఇప్పటికి అందరికి గుర్తు ఉండే ఉంటుంది..ఆయనతో ఆమె ప్రేమాయణం నడపగా ఇప్పుడు బ్రేక్ అప్ లో ఉన్నారు.. 

అంతేకాదు ఓ పెళ్లైన వ్యకి తో ఆమె ఎఫైర్ వ్యవహారం కూడా కోలీవుడ్ లో సంచలనం సృష్టిస్తుంది.. నటిగా కాకుండా రచయితగా కూడా ఆమె సుపరిచయురాలు. ‘బ్రోకెన్‌ వింగ్‌' అనే పుస్తకాన్ని కూడా రాసిన ఆమె  అందులో ప్రేమపై తన అభిప్రాయాలు వివరించారు..  కాగా ప్రస్తుతం ఆమెకు కరోనా పాజిటివ్.. అయినా కానీ తన బుగ్గలు కుక్కపిల్లతో నాకించుకుంటూ, దానితో ముద్దులాడుతూ ఫోటోలు, వీడియోలు పెట్టింది. అసలే జంతువులకు కూడా కరోనా వస్తుందని అందరూ టెన్షన్ పడుతుంటే కరోనా సోకినప్పుడు కూడా వాటితో అలా క్లోజ్ గా ఉండడం ఏంటి ? ఏమన్నా పిచ్చా ? అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆమెను కామెంట్స్ తో ఆడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: