క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందంటే చాలు ఎంతో ఆందోళ‌న చెందిపోతున్నారు. అయితే ఆందోళ‌న చెంద‌టం వ‌ల్ల ఇమ్యునిటీపై ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాగా తాజాగా టాలీవుడ్ హీరో క‌మ‌ల్ కామ‌రాజ్ త‌న కుటుంబంలో ఆరుగురికి కోవిడ్ వ‌స్తే ఆందోళ‌న చెంద‌కుండా ఎదురుకున్న విధానాన్ని మీడియాతో పంచుకున్నారు. క‌మ‌ల్ మాట్లాడుతూ...ఎర్లీ డిటెక్షన్, ఇమ్మీడియట్‌ మెడికేషన్‌తో పాటు పాజిటివ్ ఆటిట్యూడ్ తో కరోనాను ఎదురుకుందామ‌న్నారు. సినిమా షూటింగ్ కోసం డెహ్రాడూన్ వెళ్లి వచ్చాను. ఎందుకైనా మంచిద‌ని క‌రోనా టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం సెకండ్ వేవ్ ఉదృతి ఎక్కువ‌గా ఉండ‌టంతో భోపాల్ లో ఉంటున్న మా అత్త మామ‌ను ఇంటికి తీసుకువ‌చ్చాం. వారిద్ద‌రి వ‌య‌స్సు 70 ఏళ్ల పైనే ఉంటుంది. అంతే కాకుండా ఇద్ద‌రికీ షుగ‌ర్ బిపీ ఉన్నాయి. దాంతో ముందు జాగ్ర‌త్త‌గా వారు రాక‌ముందే మ‌రోసారి టెస్ట్ చేయించుకున్నాం. వారు ఇంటికి వ‌చ్చిన‌రోజే నా రిపోర్టు రాగా అందులో పాజిటివ్ వ‌చ్చింది. 

దాంతో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా వెంట‌నే మా అత్త మామ తో పాటు నా భార్య, నా త‌ల్లి దండ్రులు, ప‌నిమ‌నుల‌ష‌కు టెస్ట్ లు చేయించా. మా అత్త‌మామ కు త‌ప్ప అంద‌రికీ పాజిటివ్ వ‌చ్చింది. ముందుగా వ్యాధిని గుర్తించ‌డం వెంట‌నే మందులు ప్రారంభించ‌డం మాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది. మంచి ఆహారం తీసుకుంటూ ఆందోళ‌న చెంద‌కుండా మందు వేసుకున్నాం. నాకు ఒక రెండు రోజులు జ్వ‌రం వ‌చ్చింది త‌ప్ప ఇత‌ర ల‌క్ష‌ణాలేమీ లేవు. అంతే కాకుండా మా అత్తా మామ వ్యాక్సిన్ తీసుకుని ఉండ‌టంతో వారికి పాజిటివ్ రాలేదు. నా అభువంతో చెప్పేది ఏంటంటే పాజిటివ్ వ‌చ్చినా పాజిటివ్ గానే తీసుకుని మందులు వాడాలి. అంటూ కమ‌ల్ కామరాజు త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా క‌మల్ ఆవ‌కాయ్ బిర్యానీ సినిమాలో హీరోగా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ప‌లు సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా, బ్రద‌ర్ గా న‌టించి ఆక‌ట్టుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: