టాలీవుడ్ స‌హా మొత్తం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఇపుడు అతి పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంటోంది. సినిమా రంగం ఉనికికే ముప్పు కలిగేలా పరిణామాలు జరుగుతున్నాయి. సినిమా వారికే సినిమా కష్టాలు వచ్చేశాయి. దాంతో ఎటూ తోచని దుస్థితిలో రంగుల ప్రపంచం ఉంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ పరిస్థితి మరీ భిన్నంగా ఉంది. మొత్తం డబ్బు అంతా ఇపుడు సినిమాల మీదనే పెట్టారు. ఆ సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని బొమ్మ రిలీజ్ అయితేనే కాసులు కళకళలాడేది. దీంతో ఒక రకమైన స్లంప్ వాతావరణం ఇండస్ట్రీలో కనిపిస్తోంది.  సినిమా తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక రోజు షూటింగ్ ఆలస్యం అయితే దాని ఖర్చు వెళ్ళి బడ్జెట్ లో కలసి రెట్టింపు అవుతుంది. అలాంటిది ఒక ఏడాదిగా సినిమా షూటింగులు ఏవీ సక్రమంగా జరగడంలేదు. సినిమాలు ఇప్పటిదాక పెద్దవి రిలీజ్ అయిన సందర్భమూ లేదు. దాంతో సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ రెట్టింపు అవుతోంది.

ఇపుడు కచ్చితంగా హీరోలు రంగంలోకి దిగి ఆదుకోవాలని కోరుతున్నారు. సినిమా బడ్జెట్ లో ఎక్కువ మొత్తం హీరోల  డైరెక్టర్ల రెమ్యునరేషన్ కిందనే పోతోంది. అలాగే ఇతర విభాగాలకు కూడా గతంతో పోలిస్తే ఖర్చు ఎక్కువ అవుతోంది. ఈ పరిణామాల  నేపధ్యంలో సినిమా బతికి బట్ట కట్టాలంటే ముందు హీరోల నుంచి మొదలుపెట్టి అందరూ బడ్జెట్ కటింగ్ కి సిధ్ధపడాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో హీరోలు ఒక మెట్టు దిగి చొరవ చూపిస్తే మిగిలిన వారంతా కలసి వస్తారు అంటున్నారు. అలాగే సినిమా షూటింగుల విషయంలో కూడా మొత్తం అంతా సహకరిస్తే షెడ్యూల్ డేట్స్ కొంతైనా తగ్గి నష్టం తగ్గుతుందని అంటున్నారు. ఏది ఏమైనా సినీ రంగం గతంతో ఎన్నడూ పోల్చని విధంగా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉంది. ఇపుడు పరిశ్రమను కాపాడుకోవడానికి తలా ఒక చేయి వేయాల్సిందే అన్న మాట మాత్రం వినిపిస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: