ఐకాన్ స్టార్ అనగానే ఎవరికైనా అల్లు అర్జున్ గుర్తుకు వస్తారు.. ఇటీవలే అయన పుట్టిన రోజు సందర్భంగా బన్నీ కి ఈ బిరుదు ను అంకితం చేసేశారు అభిమానులు.. ఓ నార్మల్ నటుడి దగ్గరినుంచి స్టైలిష్ స్టార్ గా, ఇప్పుడు ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగిన క్రమం అసాధారణం అని చెప్పాలి.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా టాలెంట్ లేకపోతే ఎంతటివారినైనా ప్రేక్షకులు పక్కన పెట్టేస్తున్న రోజుల్లో తన టాలెంట్ ను ప్రేక్షకులను చూపించడంలో మొదటి సినిమా నుంచి అల్లు అర్జున్ సక్సెస్ అయ్యాడు..

గంగోత్రి సినిమా రిలీజ్ అయిన సమయంలో బన్నీ పై వచ్చిన విమర్శలు ఏ డెబ్యూ హీరో కి కూడా రాలేదు.. హీరో గా పనికిరాడన్నారు, అసలు హీరో అయ్యే ఫేసేనా అది అని వెక్కిరించారు.. ఆ స్టేజి నుంచి తనదైన స్టైల్స్ చూపిస్తూ విమర్శించిన నోటితోనే ప్రశంశలు దక్కించుకున్నారు అల్లు అర్జున్.. తన స్టైల్స్ ని సినిమా సినిమా కి మారుస్తూ
అభిమానులు, ప్రేక్షకులు  కూడా ఫాలో అయ్యే విధంగా చేసి ఇప్పుడు సౌత్ లోనే బెస్ట్ యాక్టర్ గా వెలుగొందుతున్నాడు.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు..

ఇప్పటికే అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుండగా బన్నీ ఆచితూచి మరీ పుష్ప ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఎంచుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. తనకు రెండు సూపర్ డూపర్ హిట్ లు అందించిన సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో బన్నీ పూర్తిగా తన మేకోవర్ ని మార్చుకున్నాడు. సినిమా సినిమా కి గానూ అల్లు అర్జున్ తన మేకోవర్ ను మార్చుకుంటూ సినిమా పై ఉన్న అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ ఇప్పుడు ఇంతటి స్టార్ గా ఎదిగాడు.. ఇప్పటితరం యువతకి ఈ ఐకాన్ స్టార్ రోల్ అయ్యాడని చెప్పొచ్చు.. ఆయనను ఆదర్శంగా తీసుకుని వారి కూడా అంకితభావం తో పనిచేసి ప్రతి ఒక్కరు ఐకాన్ స్టార్ లా మారవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: