దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. సామాన్య ప్రజల నుండి సెలబ్రెటీల వరకు అందరు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా ప్రముఖుడిని బలితీసుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై చిరపరిచితుడైన రాహుల్ కరోనా వైరస్ బారినపడిన తర్వాత ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.

ఇక రోజురోజుకు ఆయన  ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుండడంతో జీవితంపై ఆశలు వదిలేసుకున్నాడు. తనకు సరైన వైద్యం అందడం లేదని ఊహించాడు. అందుకనే తనకు ఇంకాస్త మంచి వైద్యం అందితే బతుకుతానన్న ఆశను బయటపెట్టాడు. చివరికి బతుకుతానన్న ధైర్యాన్ని కోల్పోయాడు. ధైర్యం సన్నగిల్లుతోందంటూ నిన్న పోస్టు పెట్టాడు. చివరి నిమిషంలో మరో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


కాగా.. రాహుల్ గతవారం ఫేస్‌ బుక్‌ లో ఓ పోస్టు చేశారు. ఆయన నా కూడా మంచి వైద్యం అందితే బతుకుతా’ అంటూ ఫేస్‌ బుక్‌ లో తన పరిస్థితిని వెల్లడించిన కాసేపటికే ఉత్తరాఖండ్‌కు చెందిన నటుడు రాహుల్ వోహ్రా కన్నుమూశాడు. ఆ నటుడు ఈ మాట చెప్పడానికి ముందు ఎంత నరకం అనుభవించి ఉంటాడో తలచుకుని సోషల్ మీడియా కన్నీరు పెడుతోంది.

ఇక తాను బతికే అవకాశాలు లేవని ఓ నిర్ణయానికి వచ్చేసిన రాహుల్.. ‘మళ్లీ పుడితే మంచి పనులు చేస్తా. ఇప్పటికైతే బతుకుతానన్న ఆశ లేదు’’ అంటూ అతడు పెట్టిన పోస్ట్ హృదయాలను మెలితిప్పుతోంది. రాహుల్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని థియేటర్ డైరెక్టర్-ప్లేరైట్ అరవింద్ గౌర్ నేడు ఫేస్‌బుక్ పోస్టు ద్వారా వెల్లడించాడు.  

రాహుల్ వెళ్లిపోయాడు. మంచి నైపుణ్యం ఉన్న నా నటుడు ఇక లేడు. మరింత మంచి వైద్యం అందితే బతుకుతానని నిన్ననే నాతో చెప్పాడు. సాయంత్రం ద్వారకాలోని ఆయుష్మాన్‌కు తరలించాం. కానీ అతడి ప్రాణాలను కాపాడలేకపోయాం. మమ్మల్ని క్షమించు. మేమందరం దోషులమే’’ అని అరవింద్ తన ఫేస్‌బుక్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: