కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఇక తెలుగులో రామ్ " నేను శైలజ" సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది కీర్తి సురేష్.ఇక ఆ తరువాత వరుసగా హిట్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయ్యింది. ఇక సావిత్రమ్మ జీవిత చరిత్ర మహానటి సినిమాతో ఒక్కసారిగా తన క్రేజ్ ను పెంచేసుకుంది కీర్తి సురేష్. అయితే కీర్తి సురేష్ మొదటి నుంచి గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అవసరం అయితే గాని గ్లామర్ డోస్ పెంచడం లేదు. వీలైనంత వరకు ఆమె రొమాంటిక్ సన్నివేశాలకు ఒప్పుకోదు. కథ నచ్చితే మాత్రం లైన్ దాటకుండా పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమె మొదటిసారి ఒక పాత్ర కోసం కొంత అందాలను ప్రదర్శించడానికి రెడీ అవుతుంది. ఇక కెమెరా ముందు అందంగా ప్రదర్శన చేసింది.

స్లీవ్ లెస్ చీరలో ఒక మహారాణి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. చూపించి చూపించకుండా నడుమందాలను కూడా బాగానే బాగానే ప్రదర్శన చేసి యూత్ ని ఎంతగానో కైపెక్కిస్తుంది కీర్తి.మళయాళంలో తెరకెక్కుతున్న మోహన్ లాల్ బిగ్ బడ్జెట్ మూవీ మరక్కర్ సినిమా కోసం ఇలా రెడీ అయ్యి గ్లామర్ అవతారం చూపిస్తుందట.ఇక ఆ సినిమాను దాదాపు 100కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. పాత్ర బాగా నచ్చడంతో డానికి బాగా కనెక్ట్ అయ్యి కీర్తి ట్రెడిషనల్ లుక్కులొనే గ్లామర్ డోసును పెంచేసింది.ఫొటోలనే ఇంత అందంగా ఉందంటే ఇక సినిమాలో అమ్మడు ఇంకెంత అందంగా ఉంటుందో అని అభిమానులు బాగా కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో కీర్తి సురేష్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాలకు కుడా త్వరలోనే చెయ్యబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: