బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఎప్పుడూ కంగనా ఎదో ఒక హాట్ టాపిక్ ను పట్టుకుని సోషల్ మీడియాలో తన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. అప్పట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరవాత కంగనా వరుస ట్వీట్లతో బాలీవుడ్ పరిశ్రమకే చమటలు పట్టించింది. ఇండస్ట్రీలో నెపోటిజం వళ్ళే సుశాంత్ మరణించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఆ ఇష్షు చల్లబడగానే సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై స్పందించడం మొదలు పెట్టింది. అంతే కాకుండా వాళ్ళు అసలు రైతులే కాదంటూ వ్యాఖ్యలు చేసింది. దాంతో కంగనా పై నెటిజన్ లు ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆ టాపిక్ కూడా మరుగున పడింది . అయితే ఇటీవల బెంగాల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే .

కాగా ఫలితాలు వచ్చిన తరవాత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. కాగా కంగనా ఆ అల్లర్లపై రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టింది . దాంతో ట్విట్టర్ కంగనా అకౌంట్ ను శాశ్వతంగా బ్లాక్ చేసింది . దాంతో ఫైర్ బ్రాండ్ అదృష్టవశాత్తు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు కూడా ఉన్నాయిగా అందులో నా వాయిస్ వినిపిస్తా అంటూ పేర్కొంది . అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ కూడా కంగనా కు చిన్న షాక్ ఇచ్చింది. కంగనా పెట్టిన ఓ పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ తొలగింది. కంగనా కు శనివారం కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో వెల్లడించింది. అయితే పోస్ట్ లో కంగనా..కరోనా చిన్న ఫ్లూ మాత్రమేనని దానికి భయపడవద్దని దాన్ని  నొక్కి పాడేయండి. అని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కంగనా పోస్ట్ ను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: