ఇపుడు ఓటీటీ రేంజి పెరిగింది. అదే సమయంలో డిమాండ్ కూడా పెరిగింది. ఓటీటీ ఒక్కటే ఇపుడు ఒక ప్రధానమైన వినోదంగా మారిపోయింది. థియేటర్ వ్యవస్థను ఓటీటీ పక్కకు తోసేస్తుందా అన్న అనుమానాలు ఉన్నాయి కానీ అదే సమయంలో టెక్నాలజీ తెచ్చిన మంచి పరిణామంగానే దీన్ని చూడాలి తప్ప ఓటీటీని సినిమా హాళ్ళకు ఆల్టర్నేషన్ గా భావించకూడదు అని సినీ మేధావులు చెబుతారు.

ఇదిలా ఉంటే ఓటీటీకి మళ్ళీ కరోనాతో కాలం కలసి వచ్చింది. అయితే ఈసారి చిన్న సినిమాలతో సరిపెట్టకుండా బిగ్ షాట్స్ మూవీన్ ని లాగేయాలని చూస్తోంది. వాటిని కనుక ఓటీటీలకు తెస్తే మంచి డిమాండ్ ఉంటుంది, తమ ఫ్లాట్ ఫారానికి కూడా ఎనలేని గుర్తింపు వస్తుంది అని కూడా భావిస్తోంది. ఈ నేపధ్యంలో ఈసారి టాప్ స్టార్స్ మూవీస్ నే టార్గెట్ చేసినట్లుగా చెబుతున్నారు.

ముఖ్యంగా మే నెలలో రాకుండా వాయిదా పడిన  బాలయ్య అఖండ మూవీ కి ఒక పెద్ద ఓటీటీ నిర్వాహకులు ఫ్యాన్సీ రేటు ఇచ్చి మరీ అడిగారు అంటున్నారు. అయితే ఎప్పటికైనా థియేటర్లలోకి తీసుకువచ్చి బాలయ్య స్టామినాను ప్రూవ్ చేయాలని చిత్ర యూనిట్ ఉంది. పైగా అఖండ మీద మంచి అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు. దాంతో వారు ఏమీ చెప్పలేదు అంటున్నారు.

ఇక మే నేలలో రిలీజ్ కాలేక వాయిదా పడిన మరో  మూవీ ఖిలాడీ కూడా అమెజాన్ ప్రైమ్  కన్నేసిందని అంటున్నారు. ఈ మూవీ లో రవితేజా డబుల్ రోల్ ప్లే చేయడం, ఆయనకు ప్రీవియస్ గా  క్రాక్ వంటి మాస్ హిట్ ఉండడంతో ఈ మూవీకి 45 కోట్ల దాకా ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. అయితే ఈ చిత్ర యూనిట్ కూడా ఏమీ చెప్పలేదని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే వెంకటేష్ దృశ్యం 3 మూవీ కూడా ఓటీటీకి అడిగారు అంటున్నారు. నారప్ప విషయంలోనూ గట్టిగానే ఆఫర్లు వెళ్ళాయని చెబుతున్నారు. ఇవే కాకుండా కొన్ని క్రేజీ ప్రాజెక్టుల విషయంలో కూడా ఓటీటీ నిర్వాహకులు ఎంత రేటు ఇచ్చి అయినా తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికైతే ఏదీ వర్కౌట్ కాలేదనే అంటున్నారు. మరి చూడాలి ఓటీటీ పెద్దాశలు నెరవేరతాయా. వారు ఇస్తున్న టెంప్టింగ్ ఆఫర్ల పట్ల ఎవరైనా మోజు పడతారా అన్నది చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: