యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’.. ఈ చిత్రంతో తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి.ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ఇటీవల వరకు స్పీడ్‌గా జరిగింది. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి ఆర్ఆర్ఆర్ టీమ్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది.. అనుకున్న తేదీకి రావడం పక్కా అనుకుంటున్న టైంలో సెకండ్ వేవ్ కారణంగా షూటింగులకు ప్యాకప్ చెప్పేశారు.

థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో ఎప్పుడు పరిస్థితి అదుపులోకి వస్తుందో, అప్పుడే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేద్దామని మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ టీం ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కోసం ట్రీట్ రెడీ చెయ్యబోతోందని సమాచారం. మే 20న తారక్ బర్త్‌డే కాబట్టి ఆరోజు న్యూ రిలీజ్ డేట్‌తో కూడిన యంగ్ టైగర్ పోస్టర్ ఒకటి వదలాలని ప్లాన్ చేస్తున్నారు. 2022 జనవరి లేదా వేసవిలో విడుదల చేసే అవకాశముందని టాలీవుడ్ టాక్..అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యేకొద్ది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానుల్లో నిరాశ ఎక్కువైపోతుంది.

వారి అభిమాన హీరోని చూడక ఇప్పటికి 2 సంవత్సరాలు అవ్వడంతో రాజమౌళి మీద వారి అభిమానులు బాగా కోపంతో ఉన్నారని టాక్. అయితే అభిమానులు ఎంత కోపంలో ఉన్న కూడా రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో సినిమాలని సూపర్ హిట్ చేసి ఆ కోపాన్ని అంత తగ్గించేస్తారు. ఇలా సినిమాలు లేట్ అవ్వడం రాజమౌళి కి కొత్తం కాదు. ఆయన మగధీర సినిమా నుంచి ఇది జరుగుతూనే ఉంది.ఆయన సినిమాల బడ్జెట్స్ పెరిగేకొద్దీ సినిమాలు ఇంకా ఆలస్యం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: