రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే ఆ రోజుల్లో ఎంతో క్రేజ్ ఉండేది. ఆయన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే వారు. ఇక ఇప్పటికీ కృష్ణంరాజు సినిమాలు ఏవైనా బుల్లితెర మీద వస్తున్నాయి అంటే, చిన్న పెద్ద ప్రతి ఒక్కరు టీవీ ముందు వాలిపోవాల్సిందే. అంతలా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి ఈయన సినిమాలు. ఇదిలా ఉండగా రెబల్ స్టార్ జీవితాన్ని 555 సిగరెట్ ప్యాక్ మార్చేసిందట. అదెలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


సినీ ఇండస్ట్రీ లో జరిగే పరిణామాలు ఎంత వింతగా ఉంటాయి అంటే, ఎంతో శ్రమిస్తే తప్ప సినిమా ఛాన్స్ రాదు. ఒకవేళ వచ్చినా కూడా చివరిక్షణంలో చేజారిపోతుంది. అయితే ఇక్కడ జరిగిన వింత ఘటన ఏమిటంటే, డూండీ సమర్పణలో వి.మధుసూదనరావు డైరెక్షన్ లో  వీరాభిమన్యు మూవీ తీశారు. అంటే అర్జునుడి చుట్టూ తిరిగే పాత్ర ఇది. ఇక ఇందులో అభిమన్యుడు పాత్ర కోసం చురుకైన కుర్రాడు కావాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు దర్శకనిర్మాతలు. నర్తనశాల వంటి చిత్రాల్లో అభిమన్యుడిగా వేసిన హరనాథ్ ను తీసుకోవాలని డూండీ చెబితే కొత్త కుర్రాడిని పెడదామని మధుసూదన్ రావు అన్నారు.

ఒకసారి చెన్నైలోని ఆంధ్ర క్లబ్ కి వెళ్ళిన డూండీ కి  అక్కడ ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు కనిపించాడట. అతడు సినిమా వేషాల కోసమే ట్రై చేస్తున్నాడని తెలియడంతో అతడి దగ్గరకు వెళ్లి, మా సినిమాలో ఉంది రేపు వచ్చేయ్ అంటూ ఆ కుర్రాడి చేతిలో విజిటింగ్ కార్డు పెట్టారు డూండీ. దాంతో ఆ కుర్రాడు అనుకున్న సమయానికి చెప్పిన చోటికి వచ్చేసాడు. అయితే అక్కడికి డూండీ వచ్చారు. కానీ మధుసూదన్ రావు రాకపోవడంతో చేతిలో ఉన్న 555 సిగరెట్ ప్యాకెట్ తో అరగంటకోసారి బయటకు వెళ్లి ధూమ పానం చేసి రావడం చేశాడు ఆ కుర్రాడు.

ఇక ఎంతకీ మధుసూదన్ రావు రాకపోయేసరికి, బయటికి వెళ్లి వద్దామని సిగరెట్ ప్యాకెట్ అక్కడే వుంచి, బయటికి వెళ్లాడు ఆ కుర్రాడు.ఈలోగా మధుసూదన్ రావు ఎంటర్ అయ్యి , ఆ కుర్రాడి కోసం కబురు పెడితే, అతడి కోసం పరుగులు తీశారు. మొత్తానికి వచ్చాడా ? ఇంతకూ ఈ సిగరెట్ ప్యాకెట్ ఎవరిది అని డూండీ అడుగుతుండగా, ఇంతలోనే ఆ కుర్రాడు వచ్చి నాదేనంటూ జవాబు ఇచ్చాడు. మధుసూదన రావు నీకు ఈ వేషం లేదు. నాకు సిగరెట్ తాగే వాళ్ళంటే పడదు. నాకోసం ఈ అలవాటు మార్చుకోవద్దు అని చెప్పేశాడు. దాంతో ఆ కుర్రాడు నీరసంగా ఇంటిదారి పట్టాడు.ఆ కుర్రాడే  కృష్ణంరాజు..

ఈ సంఘటన జరిగిన రెండేళ్ళ తరువాత కృష్ణంరాజు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక వీరాభిమన్యు పాత్రలో శోభన్ బాబు ను సెలెక్ట్ చేసుకున్నారు. లేదంటే ఆ పాత్రలో కృష్ణంరాజు ఉండేవారట..


మరింత సమాచారం తెలుసుకోండి: